రాంపూర్: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉనక లారీ(Husk Truck) బోల్తాపడింది. ఓ సిగ్నల్ వద్ద టర్నింగ్ తీసుకుంటున్న బోలెరో వాహనంపై ఆ ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోలెరో వాహనంలో ఉన్న డ్రైవర్ మృతిచెందాడు. ఈ ప్రమాదానికి చెందిన సీసీటీవీ వీడియో వైరల్ అవుతున్నది. రాంపూర్-నైనిటాల్ హైవే మీదున్న పహాడి గేటు సిగ్నల్ వద్ద ప్రమాదం జరిగింది. టర్నింగ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న బోలెరో వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ఉనక లారీ ఢీకొట్టింది. అయితే ప్రమాదాన్ని తప్పించేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. కానీ రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న ఉనక లారీ .. ఆ వేగంతో బోలెరో వాహనంపై పడింది. విద్యుత్తు శాఖ సబ్ డివిజనల్ ఆఫీసర్‌ను ఆఫీసు వద్ద దించి వస్తున్న బోలెరో డ్రైవర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
how death comes,in what all ways!
in Uttar pradesh Rampur,a truck loaded with husk overturned onto a bolero just like that!
the bolero belonged to the electricity department’s SDO,whose driver died on the spot. pic.twitter.com/fxA41qE3R9
— social scientist (@socialscie50255) December 29, 2025