దుబాయ్ : భారత క్రికెటర్లు స్మృతి మంధాన, అభిషేక్ శర్మ సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు గెలుచుకున్నారు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో అభిషేక్.. ఏడు మ్యాచ్‌ల్లోనే 314 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును సొంతం చేసుకున్నాడు. అంతేగాక టీ20 ఫార్మాట్లో నెంబర్ వన్ ర్యాంకుకూ ఎగబాకిన అతడు..
తాజాగా ఐసీసీ అవార్డునూ గెలుచుకోవడం గమనార్హం. ఇక మహిళల విభాగంలో ఓపెనర్ మంధాన.. గత నెలలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు శతకాలు, ఓ అర్ధ శతకంతో రాణించింది. గత నెలలో నాలుగు మ్యాచ్‌లు ఆడి 308 రన్స్ చేసింది.