ఢిల్లీ: క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా వేచిచూస్తున్న ఆసియా కప్ – 2025 షెడ్యూల్ వచ్చేసింది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నీని యూఏఈలో నిర్వహించనున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో అధికారికంగా వెల్లడించారు. పూర్తి షెడ్యూల్‌ను ఏసీసీ ‘ఎక్స్’ ఖాతాలో ప్రకిటించారు. 17 వ ఎడిషన్‌గా జరుగబోయే ఈ టోర్నీలో భారత్ తమ తొలి పోరును సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే మ్యాచ్‌తో టైటిల్ వేటను ఆరంభించనుంది. 14న భారత్, పాక్ తలపడనున్నాయి.
8 దేశాలు పాల్గొనబో యే ఈ టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించగా గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఓమన్ ఉన్నాయి. గ్రూప్-బీలో బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, హా ంకాంగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 9 నుంచి 19 దాకా గ్రూప్ దశ మ్యాచ్‌లను నిర్వహించనుండగా 20 నుంచి సూప ర్ -4 స్టేజ్ మొదలవుతుం ది. 28వ తారీఖున ఫైనల్ జరుగుతుంది. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉం డటంతో ఈ టోర్నీలో దాయాదులు మూడుసార్లు (ఇరుజట్లు ఫైనల్ చేరకుంటే రెండుసార్లు) ఢీకొనే అవకాశముంది.