IND vs ENG : ఇంగ్లండ్ (England) తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (T20 series) లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఇవాళ జరుగుతోంది. భారత్ (India) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కోల్‌కతా (Kolkata) లోని ఈడెన్ గార్డెన్ (Eden Garden) మైదానంలో ఈ మ్యాచ్ ఆడుతున్నారు. ఈడెన్ గార్డెన్లో రెండు జట్లకు టీ20ల్లో మంచి రికార్డు ఉంది.
భారత్ కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఇప్పటికే దక్షిణాఫ్రియాను మట్టికరిపించి సీరిస్ దక్కించుకుంది. అదే సమయంలో ఇంగ్లండ్ కూడా వెస్టిండీస్‌పై సిరీస్ నెగ్గి మంచి ఊపులో ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ రెండు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.
తుది జట్లు ఇవే..
భారత్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ : బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, జామీ ఓవర్టన్, గూస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
Maoist Chalapathi | ఆమెతో దిగిన సెల్ఫీయే మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణం తీసిందట..!
Civils prelims | యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ విడుదల.. ఈ ఏడాది తగ్గిన పోస్టులు
Shah Rukh Khan | చిరుత దాడి నుంచి తృటిలో తప్పించుకున్న షారుక్ ఖాన్..!
six planets | ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు
Dog revenge | ఢీకొట్టిన కారు యజమానిపై ప్రతీకారం తీర్చుకున్న కుక్క.. Video viral