పుణె: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ పేలవ ఆటతీరు కొనసాగుతున్నది. గ్రూప్-‘బి’లో భాగంగా ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింట ఓడి ఒక ‘డ్రా’ నమోదు చేసుకున్న హైదరాబాద్.. మంగళవారం మహారాష్ట్రతో ఆరంభమైన పోరులోను ఆకట్టుకోలేక పోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన మహారాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. నౌషద్ (145 బ్యాటింగ్) సెంచరీ సాధించగా.. కేదర్ జాదవ్ (71), అశయ్ పాల్కర్ (61 బ్యాటింగ్) రాణించారు. మన బౌలర్లలో కార్తికేయ 3, రవితేజ రెండు వికెట్లు పడగొట్టారు.