దమ్మచెరువు లబ్దిదారులకు ‘డబుల్’ ఇండ్లు అందజేత

సిద్ధిపేట : జిల్లాలోని సిద్దిపేట రూరల్ మండలం సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక అనుబంధ గ్రామం దమ్మ చెరువులో 56 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి హరీశ్‌రావు అందజేశారు. శనివారం జరిగిన సామూహిక గృహ ప్రవేశాలకు మంత్రి హాజరై గృహా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. చింతమడక- దమ్మ చెరువు ఐక్యతకు నిదర్శనం అన్నారు. ఈ గ్రామస్తులందరిదీ ఒకే మాట.. ఒకే బాట. ఐక్యత ఉంటే తొందరగా పనులు జరుగుతాయనేందుకు నిదర్శనం చింతమడక-దమ్మచెరువు అన్నారు.
60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఏలాంటి సాయం అందించాలన్న అంశంపై సీఎం కేసీఆర్‌తో తర్వలోనే చర్చించి నిర్ణయిస్తామన్నారు. చింతమడక-దమ్మచెరువు మిగులు పనులు, లబ్ధిదారులకు రావాల్సిన నిధుల విషయమై వారంలో పరిష్కారం చేస్తామన్నారు. చింతమడక-దమ్మచెరువు గ్రామాల్లో మినీ ఫంక్షన్ హాల్, బడి, అంగన్వాడీ, బస్ షెల్టర్, నర్లేoడ గడ్డ రోడ్డును త్వరలోనే వేయిస్తానని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

