ధూళిమిట్టలో ధరణి రిజిస్ట్రేషన్లు షురూ

ధూళిమిట్ట, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని కొత్తగా ఏర్పడిన ధూళిమిట్ట మండల తహసీల్ కార్యాలయంలో బుధవారం భూ రిజిస్ట్రే షన్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఇద్దరి కి రిజిస్ట్రేషన్లు చేసినట్లు తహసీల్దార్ అశోక్, సర్పంచ్ దుబ్బుడు దీపికావేణుగో పాల్‌రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా రంగ ధాంపల్లికి చెందిన మాచాపురం మహేం దర్‌కు ధూళిమిట్ట మండలం బెక్కల్ గ్రా మం సర్వే నెం. 289/బీ/2లో ఎకరం భూమికి సంబంధించిన మ్యుటేషన్ చేసి, ధ్రువప త్రాన్ని లబ్ధిదారుడికి అందజేశారు. కూటిగల్ గ్రా మా నికి చెందిన దేవులపల్లి తిరుపతి తన 3 ఎకరాల 23 గుంటల భూమిని కొడుకు మహేశ్‌కు వారస త్వంగా రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇక నుంచి మం డల ప్రజలందరికీ రెవెన్యూ సేవలు అందుబాటు లో ఉంటాయని తహసీల్దార్ అశోక్ తెలిపారు.
మొదటి వ్యక్తిని కావడం ఆనందంగా ఉంది
మాది సిద్దిపేట జిల్లా రంగధాంపల్లి గ్రామం. నాకు ధూళిమిట్ట మండలం బెక్కల్‌లో ఎకరం భూమికి సంబంధించి మ్యుటేషన్ పెండింగ్ ఉండడంతో ఇన్ని రోజులు ఇబ్బందయ్యింది. ఇక్కడ రిజిస్ట్రేషన్లు ప్రారంభంకావడంతో ఆ సమస్య పరిష్కారమై, 15 నిమిషాల్లో ధ్రువపత్రాలు ఇచ్చారు. కొత్త మండలంలో మొదటి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి నేను కావడం ఆనందంగా ఉంది.
-మాచాపురం మహేందర్
సీఎం పుట్టిన రోజున కావడం శుభ పరిణామం
కొత్త మండలాన్ని ప్రసాదించిన ముఖ్యమంత్రి పుట్టిన రోజున ధూళిమిట్టలో పూర్తిస్థాయి రెవెన్యూ సేవలు ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. మండల ప్రజలందరూ రెవెన్యూ సేవలను వినియోగించుకోవాలి. రెవె న్యూ సేవల ప్రారంభానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
- దుబ్బుడు దీపికా వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్, ధూళిమిట్ట