Everest Masala | హాంకాంగ్: భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న ‘ఎవరెస్ట్ చేపల కూర మసాలా’లో పరిమితికి మించి పురుగుమందు అవశేషాలు ఉన్నట్టు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (ఎస్ఎఫ్ఏ) ఆరోపించింది. దీంతో ఫిష్ మసాలా ప్యాకెట్లను రీకాల్ చేయాలని ఎస్ఎఫ్ఏ ఆదేశించింది. హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ జారీ చేసిన నోటిఫికేషన్‌కు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్టు సింగపూర్ తెలిపింది. ఉత్పత్తులను వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించాలని ఎస్పీ ముత్తయ్య అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సూచించింది. అయితే ఈ ఆరోపణపై ఎవరెస్ట్ కంపెనీ ఇంకా స్పందించలేదు.