పరిశుభ్రంగా ఉండండి.. అంటువ్యాధులను అరికట్టండి : మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ | ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే.. అంటు వ్యాధులను అరికట్టొచ్చు అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

రాజన్న సిరిసిల్ల : ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే.. అంటు వ్యాధులను అరికట్టొచ్చు అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వేములవాడ మున్సిపాలిటీలోని 10వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. పట్టణ ప్రగతిలో భాగంగా కూలిపోయిన ఇండ్లు, కంకర కుప్పలను తొలగించాలన్నారు. వేములవాడ పట్టణం దక్షిణ కాశీగా పేరు గాంచింది. రాజన్న ఆలయానికి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని.. ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. రహదారుల విస్తరణ, పారిశుద్ధ్య నిర్వహణ, చెట్ల పెంపకంపై దృష్టి సారిస్తామన్నారు. వేములవాడ పట్టణంలో మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్
మిషన్ భగీరథ లైన్ 60 శాతం పూర్తి అయిందని పేర్కొన్న కేటీఆర్.. దసరా లోపు వేములవాడ పట్టణంలో ఉన్న 14 వేల కుటుంబాలకు నల్లా నీరు అందిస్తాం అని చెప్పారు. ఒక్క రూపాయి చెల్లించి నల్లా కనెక్షన్ తీసుకోవచ్చు అని సూచించారు. వేములవాడలో మార్కెట్ నిర్మాణం కోసం రూ. 5 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. గడిచిన ఏడేళ్లలో వేములవాడ అభివృద్ధి ఎలా ఉందో మీరే చూసి చెప్పాలన్నారు. 10వ వార్డులో కమ్యూనిటీ మహిళా భవనానికి తక్షణమే రూ. 20 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
వేములవాడ మున్సిపాలిటీలోని 10వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి @KTRTRS ప్రసంగించారు. వేములవాడ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని.. ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. రహదారుల విస్తరణ, పారిశుద్ధ్య నిర్వహణ, చెట్ల పెంపకంపై దృష్టి సారిస్తామన్నారు. pic.twitter.com/3QK4xtdFMS
— KTR, Former Minister (@MinisterKTR) July 3, 2021
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

