ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Jan 04, 2021 , 02:01:38

‘స్వచ్ఛత’ ఆచరణలో చూపాలి

‘స్వచ్ఛత’ ఆచరణలో చూపాలి

  • స్వచ్ఛ సర్వేక్షణ్‌ -2021లో సిద్దిపేటను అగ్రభాగాన నిలుపాలి 
  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 
  • పురపాలక సంఘం ఆధ్వర్యంలో ‘పట్టణ పరిశుభ్రత - ప్రతి ఒక్కరి కర్తవ్యం’పై స్వచ్ఛ రంగవల్లుల పోటీలు

సిద్దిపేట రూరల్‌, జనవరి 03 :  స్వచ్ఛత ఆచరణలో చూపుతూ స్వచ్ఛ సర్వేక్షణ్‌-21లో సిద్దిపేటను అగ్రభాగంలో నిలుపాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట కేసీఆర్‌నగర్‌లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ -2021లో భాగంగా పట్టణ పరిశుభ్రత - ప్రతి ఒక్కరి కర్తవ్యం పేరుతో స్వచ్ఛ రంగవల్లుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. స్వచ్ఛతపై వేసిన రంగవల్లులను పరిశీలించారు. పోటీల్లో మొదటి స్థానం సాధించిన హారిక, ద్వితీయ స్థానం లావణ్య, తృతీయ స్థానం అఖిలకు మంత్రి హరీశ్‌రావు బహుమతులు అందించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ -2021లో పట్టణ ప్రజలు క్రీయాశీలక భాగస్వామ్యం కావాలన్నారు. పట్టణాల స్వచ్ఛత, పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని అభిప్రాయాలు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, వైస్‌ చైర్మన్‌ అక్తర్‌పటేల్‌, ఆర్డీవో అనంతరెడ్డి, సుడా వైస్‌ చైర్మన్‌ రమణాచారి, ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాం, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

VIDEOS

logo