‘తెలంగాణ సేవక్'ను సద్వినియోగం చేసుకోవాలి

సిద్దిపేటలో ఉచిత వృత్తివిద్యా శిక్షణ కేంద్రం ప్రారంభం
స్వర్ణకారుల సంఘం భవన నిర్మాణానికి మరో రూ.30 లక్షలు
రూ. కోటితో కోమటి చెరువు వరద కాల్వలపై బ్రిడ్జి నిర్మాణం
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
సిద్దిపేట కలెక్టరేట్, జనవరి 2 : స్వర్ణకారుల సంఘం భవన నిర్మాణ పనులకు అదనంగా మరో రూ.30 లక్షలు కేటాయిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. శనివారం ఆయన పట్టణంలోని 3వ వార్డులో రూ.10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు, మమ్మాయమ్మ దేవాలయంలో రూ.30లక్షలతో విశ్వబ్రాహ్మణ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కౌన్సిలర్ గుడాల శ్రీకాంత్ సంధ్యా నివాసంలో నిరుపేదలకు కుట్టుమిషన్లు అందజేశారు. 12 వార్డులో రూ.10 లక్షలతో, 30వ వార్డులో రూ.15 లక్షలతో, 26వ వార్డు నుంచి 34వ వార్డు వరకు, 32వ వార్డులో నిర్మించే సీసీ రోడ్లు - రీస్టోరేషన్ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.
సిద్దిపేటలో తెలంగాణ సేవక్ కేంద్రం ప్రారంభం
సిద్దిపేటలో తెలంగాణ సేవక్ ఉచిత సేవా కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కేంద్రంలో నిరుద్యోగ యువతకు వృత్తిపరమైన విద్యలో నైపుణ్యాలపై శిక్షణ, స్వయం ఉపాధి కల్పనకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సెల్ఫోన్లు, ఏసీ రిపేర్లు, సీసీ కెమెరాలపై శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పన అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ అవకాశాన్ని పట్టణంలోని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం తెలంగాణ సేవక్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి, అవసరమైన మరిన్ని సేవలు సెట్విన్ ద్వారా పొంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
కోమటి చెరువు వరద కాల్వలపై బ్రిడ్జి నిర్మాణ పనులు
సిద్దిపేట 15వ వార్డు శ్రీనగర్ కాలనీలో రూ.50 లక్షలు, సిద్దిపేట శ్రీనివాసనగర్ - బీఎంఆర్ కళాశాల వెనుక ప్రాంతంలో 10వ వార్డులో రూ.50 లక్షలతో కోమటి చెరువు ఫీడర్ చానల్ వరద కాల్వలపై డబుల్ లేన్ వంతెన బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. కోమటి చెరువు వరద కాల్వ వెంట రెండు వైపులా 30 ఫీట్లు మేర రోడ్డు నిర్మాణం కోసం కావాల్సి ఉందని, స్థానిక ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, వైస్ చైర్మన్ అక్తర్‌పటేల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, మున్సిపల్ ఈఈ వీరప్రతాప్, సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్లు ధర్మవరం స్వప్న బ్రహ్మం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
క్యాలెండర్, డైరీల ఆవిష్కరణ
జిల్లాలోని ఉద్యోగ, టీచర్ల, వివిధ ప్రైవేట్ సంఘ ప్రతినిధుల సమక్షంలో శనివారం ఆయా సంఘాల వారు రూపొందించిన 2021 డైరీలు, క్యాలెండర్లను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
- ప్రయాణాల్లో ఆహార చిట్కాలు
- కుమార్తెను నరికి.. తలతో గ్రామంలో నడిచిన తండ్రి
- వ్యవసాయం చేయకపోతే తినడం మానేయాలి: శ్రీకారం రైటర్
- ధోనీ రికార్డును సమం చేసిన కోహ్లీ
- పీఎఫ్ వడ్డీరేటు 8.5 శాతమే
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
- ఆటగాళ్లకు కరోనా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా
- చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- చెన్నై చేరుకున్న ధోనీ, రాయుడు..త్వరలో ట్రైనింగ్
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం