ఆదివారం 24 జనవరి 2021
Siddipet - Nov 28, 2020 , 00:29:53

డిసెంబర్‌ 12న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌

డిసెంబర్‌ 12న జాతీయ మెగా లోక్‌ అదాలత్‌

  • రాజీపడే కేసులు లిస్టవుట్‌ చేయాలి 
  • అధికారుల సమీక్షా సమావేశంలో సీపీ జోయల్‌ డెవిస్‌ 

సిద్దిపేట టౌన్‌ : జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ డిసెంబర్‌ 12న ఉన్నందున రాజీపడే కేసుల్లో ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ సూచించారు. జాతీయ లోక్‌ అదాలత్‌ను పురస్కరించుకొని కమిషనరేట్‌ కార్యాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీపడే కేసుల లిస్టవుట్‌ను తయారు చేయాలన్నారు. చిన్న చిన్న కేసులతో విలువైన జీవితాలను పాడు చేసుకోవద్దన్నారు. ఒకే గ్రామంలో ఉండే వారు కాబట్టి రాజీయే రాజమార్గమనే విషయాన్ని అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. లిస్టవుట్‌ తయారు చేసుకొని రాజీపడే విధంగా కృషిచేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్‌ వారెంట్లను ఎగ్జిక్యూట్‌ చేయాలన్నారు. డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్రైమ్‌ రివ్యూ తీసుకోడం జరుగుతుందని చెప్పారు. యూఐ కేసులను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. లోక్‌ అదాలత్‌లో సాధ్యమైనంత వరకు ఎక్కువ మొత్తంలో కేసులు డిస్పోజల్‌ అయ్యేటట్లుగా చూడాలన్నారు. కోర్టు విధులు నిర్వర్తించే వారందరూ బాధ్యతతో కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచాలన్నారు. సమావేశంలో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ సురేంద్ర, ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఏఎస్సై స్వామిదాస్‌, కానిస్టేబుళ్లు రాజమల్లు, శ్రీధర్‌, స్వామి తదితరులు ఉన్నారు. 

 కమిషనరేట్‌ పనుల పూర్తి చేయాలి

కొండపాక :  పోలీస్‌ కమిషనరేట్‌ నిర్మాణ పనులన్నీ  త్వరగా పూర్తి చేయాలని సీపీ జోయల్‌ డెవిస్‌ అన్నారు. శుక్రవారం కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులో నిర్మిస్తున్న నూతన పోలీస్‌ కమిషనరేట్‌ను సీపీ  సందర్శించి పనులను  పరిశీలించారు. సీపీ వెంట  రిటైర్డ్‌ ఈఈ, ప్రాజెక్టు ఇన్‌చార్జి సుదర్శన్‌రెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు ఏఈ సుధాకర్‌, ప్రాజెక్టు సూపర్‌వైజర్‌ పాపారావు, మర్కూక్‌ ఎస్‌ఐ శ్రీశైలం ఉన్నారు. 


logo