గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Sep 28, 2020 , 01:54:16

రైతు సంక్షేమంపై కేంద్రానికి చిత్తశుద్ధి కరువు

రైతు సంక్షేమంపై కేంద్రానికి చిత్తశుద్ధి కరువు

కొండపాక : కేంద్ర ప్రభుత్వం రైతుల గోస పట్టనట్టుగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం కొండపాక మండలంలోని లకుడారం, మాత్‌పల్లి, మంగోల్‌ గ్రామాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు ఉచిత కరెంట్‌ సరఫరా చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు. నూతన రెవెన్యూ చట్టంతో భూ సంస్కరణలకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని తెలిపారు. డిజిటల్‌ సర్వే చేసి ప్రతి గుంట భూమికి మ్యాప్‌ సిద్ధం చేసి పాస్‌బుక్కులు అందిస్తామని అన్నారు. బీడువారిన భూములను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో అభిషేకించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. సిద్దిపేట జిల్లాకు రావాల్సిన పాడిరైతుల ఇన్సెంటీవ్‌ రూ.10.10 కోట్లను త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేస్తారన్నారు. అంబేద్కర్‌ ఆశయాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్నారని అన్నారు. 

అభివృద్ధి పనులు ప్రారంభం...

కొండపాక మండలం లకుడారంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్‌రావు, అనంతరం మహిళ భవనాన్ని ప్రారంభించారు. మాత్‌పల్లిలో ముదిరాజ్‌ కమ్యూనిటీ భవనం, గ్రామపంచాయతీ నూతన కార్యాలయం, పాఠశాల అదనపు గదులు, సీసీరోడ్లు, డ్రైనేజీలను ప్రారంభించారు. మంగోల్‌లో ప్రకృతి వనం, వాటర్‌ట్యాంకు, పద్మశాలి, ఎస్సీ కమ్యునిటీ హాల్‌ భవనాలను ప్రారంభించారు. యూత్‌ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ లోక భూమారెడ్డి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ బాపురెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ ర్యాగళ్ల సుగుణ దుర్గయ్య, రైతుబంధు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు దేవీ రవీందర్‌, మండల కన్వీనర్‌ ర్యాగళ్ల దుర్గయ్య, రాష్ట్ర రైతు సలహా సంఘం సభ్యురాలు అనంతుల పద్మ, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షురాలు చిట్టి మాధురి, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నూనె కుమార్‌యాదవ్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మడుపు భూంరెడ్డి, గొర్ల కాపరుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీహరియాదవ్‌, డీబీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo