గురువారం 22 అక్టోబర్ 2020
Siddipet - Sep 27, 2020 , 02:14:26

భూ సమస్యలను పరిష్కరించేందుకే సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ

భూ సమస్యలను పరిష్కరించేందుకే సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ

  • l జహీరాబాద్‌ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు,  ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌
  • l అర్హులైన రైతులకు కొత్త పట్టాదారు  పాసుపుస్తకాలు పంపిణీ

జహీరాబాద్‌ : రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకే సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారని జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ అన్నారు. శనివారం జహీరాబాద్‌ క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్‌, కోహీర్‌ మండలాల రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పంపిణీ చేశారు. వ్యవసాయ భూములు అమ్మకాలు, కొనుగోలు చేసిన వెంటనే తహసీల్‌ ఆఫీసులో మ్యుటేషన్‌ చేస్తారన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు సైతం రైతులకు నేరుగా అధికారులు అందిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేవిధంగా సీఎం కేసీఆర్‌ రైతు సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ఈ సమావేశంలో జహీరాబాద్‌ తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావు, డిప్యూటీ తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఎంజీ. రాములు, టీఆర్‌ఎస్‌ నాయకులు నామ రవికిరణ్‌, బాబీ తదితరులు పాల్గొన్నారు.

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి  

ప్రభుత్వ దవాఖానలో రోగులకు కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోందని  ఎమ్మెలే కొనింటి మాణిక్‌రావు అన్నారు. శనివారం జహీరాబాద్‌ ఏరియా ప్రభుత్వ దవాఖాన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తోందన్నారు. వైద్యులు, సిబ్బంది దవాఖానలో అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు, వైద్యులు బాల్‌రాజు, సునీల్‌కుమార్‌తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.logo