శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jul 08, 2020 , 23:27:45

రేషన్‌ డీలర్లకు సర్కారు అండ

రేషన్‌ డీలర్లకు సర్కారు అండ

దుబ్బాక టౌన్‌ : పేదలకు ప్రతి నెలా రేషన్‌ సరుకులు అందించే డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని 52మంది రేషన్‌ డీలర్లకు కమీషన్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రేషన్‌ డీలర్ల ఇబ్బందులను గ్రహించి ప్రభుత్వం ఇటీవల కమీషన్‌ డబ్బులను విడుదల చేసిందన్నారు. దుబ్బాక మండలంలోని రేషన్‌ డీలర్లకు రెండు నెలల కమీషన్‌కు చెందిన రూ.8 లక్షల చెక్కులను డీలర్లకు అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాంచంద్రం, జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనిత, మండల రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు మంద లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. 


logo