బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 23, 2020 , 00:14:52

లాక్‌డౌన్‌ పాటిస్తున్న ప్రజలు, వాణిజ్య సంస్థలు

లాక్‌డౌన్‌ పాటిస్తున్న ప్రజలు, వాణిజ్య సంస్థలు

* సాయంత్రం 4గంటల వరకే దుకాణాలు

* వైద్య బృందాల సర్వే

* పట్టణంలో పర్యటించిన    డిప్యూటీ డీఎంహెచ్‌వో

చేర్యాల : పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగిపోతు న్న నేపథ్యంలో  స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించేందుకు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌తో పాటు పురపాలక సంఘం పలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఓ వ్యాపారితో పాటు మద్దూరు మం డల ఉద్యోగికి కరోనా నిర్ధారణ కావడంతో  వారు పట్టణంలోని 4, 5వ వార్డుల్లో నివసిస్తుండటంతో పలువురు ఆందోళనకు గురైయ్యారు.ఈ క్రమంలో పురపాలక సంఘం వారాంతపు అంగడిని బంద్‌ చేస్తున్నట్లు ప్రకటించగా, సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయం వద్ద దస్తావేజులు తయారు చేసే వారు ఈ నెల 30వ తేదీ వరకు మూసి వేయనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు  దామోదర్‌రెడ్డి తెలిపారు. అలాగే సెలూన్ల నిర్వాహకులు 7వ తేదీ వరకు షాపులు తీయొద్దని తీర్మానించినట్లు నాయీబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు తెలిపారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తీర్మానం మేరకు పట్టణంలోని అన్ని రకాల షాపులు సాయంత్రం 4గంటల వరకు క్రయవిక్రయాలు నిర్వహించనున్నాయి.

వైద్య బృందాల సర్వే

కరోనా కేసులు పెరిగిపోతుండటంతో పట్టణంలోని ప్రభు త్వ దవాఖాన పీపీపీ యూనిట్‌ వైద్యాధికారి అశ్వినిస్వాతి ఆధ్వర్యంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మురళి, భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో 8 వైద్య బృందాలు పట్టణంలోని నాల్గో వార్డులో ఇంటింటి సర్వే నిర్వహించారు. అలాగే డిప్యూటీ  డీఎంహెచ్‌వో మల్లీశ్వరి పట్టణంలో పర్యటించి కరోనా పాజిటివ్‌ వ్యక్తిని కలిసిన ప్రైమరీ కాంటాక్ట్స్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు.

  5వ వార్డులో శానిటైజేషన్‌

 మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో నివాసం ఉండే ఓ రెవెన్యూ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆ వార్డులో సోమవారం కౌన్సిలర్‌ నరేందర్‌ సోడియం హైపో క్లోరైట్‌ను స్ప్రే చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్‌ సిబ్బంది, వైద్య సిబ్బంది కరోనా నిర్ధారణ అయిన వ్యక్తి నివాసం ఉండే ప్రాంతాన్ని సందర్శించి ఆ ప్రాంతంలో నివసించే వ్యక్తులు స్వీయ నిర్బంధం పాటించాలని సూచించారు.ఏదైనా సమస్య ఉంటే తమను సంప్రదించాలని ఫోన్‌ నంబర్లను అందజేశారు.


logo