షియోమీ నుంచి అతి తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. రెడ్మీ నోట్ 10టీ స్మార్ట్‌ఫోన్‌ను షియోమీ సంస్థ విడుదల చేసింది. ఇంతకుమందు షియోమీకి చెందిన ఎంఐ నుంచి 5జీ మొబైల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెడ్మీ నుంచి మాత్రం లాంచ్ అయిన తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదే. రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో ఇది ఐదో మోడల్. ఇక రెడ్మీ నోట్ 10 సిరీస్‌లో ఇది ఐదో మోడల్ స్మార్ట్ ఫోన్. గతంలో రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, రెడ్మీ నోట్ 10ఎస్ మొబైల్స్ మన దేశంలో లాంచ్ అయ్యాయి. కానీ ఇవన్నీ 4జీ మొబైల్స్‌నే.
రెడ్మీ నోట్ 10టీ నుంచి రెండు వేరియంట్లుగా ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. వీటిలో ప్రారంభ వేరియంట్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజితో రూ.13,999కే వస్తుంది. ఇక 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజి మొబైల్ ధరను రూ.15,999గా నిర్ణయించారు. జూలై 26న ఈ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్స్‌లో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
రెడ్మీ నోట్ 10టీ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు మూడు కెమెరాలు ఉంటాయి. వీటిలో ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్ కాగా, మిగిలిన రెండు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఇక 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.1 వర్షన్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సీ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గూగుల్‌లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. త్వరలోనే 5జీ బడ్జెట్ ఫోన్లు
వాట్సాప్ లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు
వాట్సాప్ ట్రిక్స్ : కాంటాక్ట్‌లో లేని నంబర్‌కు మెసేజ్ చేయడమెలా
దూసుకెళ్తున్న పబ్జీ ఇండియా వర్షన్.. వారంలోనే 3 కోట్లకు పైగా డౌన్లోడ్లు