ఇప్పుడు ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. ఒకటి, రెండు, మూడు, నాలుగో వేవ్‌లు అంటూ కలవరపెడుతోంది. గతంలో ఎబోలా, నిఫా వైరస్లు కూడా జనాలను భయపెట్టాయి. ఇప్పటికీ కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ మనుషులకు.. మరి కంప్యూటర్లూ, ఫోన్లకు ? వాటిని కూడా వైరస్ వదలడం లేదు. కాకపోతే మనుషులకు వచ్చే వైరస్ కాదు. ఇంటర్నెట్ నుంచి వచ్చే వైరస్. గతంలో కేవలం కంప్యూటర్లు, మొబైల్స్‌పైనే ఈ వైరస్లు దాడి చేసేవి. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న టీవీ మొదలు.. లైట్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్ వరకు అన్నీ వైఫైతో కనెక్ట్ అవుతున్నాయి. అంటే.. మనకు మరింత ముప్పు పొంచి ఉన్నట్లే లెక్క. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంట్లో వాడే డివైజ్‌లు వైరస్ల బారిన పడితే వ్యక్తిగత సమాచారమంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. కాబట్టి టెక్నాలజీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అసలు డివైజ్‌లకు వచ్చే వైరస్లు ఏంటి? అవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం.
మాల్ వేర్ అనేది మాలిషస్ సాఫ్ట్వేర్ అనే పదం నుంచి వచ్చింది. మాల్వేర్ అంటే అది కూడా ఒక రకకమైన సాఫ్ట్‌వేరే. కాకపోతే ఇది మంచి పనికి ఉపయోగపడేది కాదు. దీనివల్ల మనకు ప్రమాదమే ఎక్కువ. ఇది అనుమతి లేకుండానే మన కంప్యూటర్ లేదా మొబైల్‌లోకి ప్రవేశించి.. మొత్తం డివైజ్‌ను తన అధీనంలోకి తీసుకుంటుంది.
ఇవి మనకు తెలియకుండానే మన డివైజ్‌లోకి ప్రవేశించి.. వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటాయి. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలు, ఫిషింగ్ ఎటాక్స్‌ను ఉపయోగించుకుంటాయి. ఇవి ఒక్కసారి డివైజ్‌లోకి రాగానే.. మొత్తం నెట్‌వర్క్‌పై దాడి చేస్తాయి. ఇవి సిస్టమ్‌లోకి ప్రవేశించగానే.. అందులో ఉన్న ఫైల్స్‌ను మాడిఫై లేదా డిలీట్ చేస్తుంది. హానికరమైన సాఫ్ట్వేర్లను మనకు తెలియకుండానే ఇన్స్టాల్ చేస్తుంది. డేటాను దొంగిలిస్తుంది. ఇందుకోసం కొత్త వార్మ్స్‌ను క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా హ్యాకర్లు సులువుగా దాడి చేసే వెసులుబాటు కల్పిస్తుంది.
ఈ వైరస్ అనేది ఎక్కువగా అటాచ్డ్ ఫైల్స్ ద్వారా కంప్యూటర్లోకి ప్రవేశిస్తుంది. ఇందుకోసం వర్డ్ డాక్యుమెంట్ లేదా ఎక్యుక్యూటేబుల్ ఫైల్స్‌ను వినియోగించుకుంటుంది. .exe ఫైళ్ల ద్వారా ఈ వైరస్ డివైజ్‌ల్లోకి ప్రవేశిస్తుందని చాలామందికి తెలుసు. అయితే ఇంకా చాలా రకాల ఎక్స్టెన్షన్స్ ద్వారా ఈ వైరస్ డివైజ్‌లోకి వచ్చి చేరుతుంది. వెబ్‌సైట్స్, ఫైల్ షేరింగ్, ఈమెయిల్ అటాచ్మెంట్ డౌన్లోడ్స్ .. ఇలా దేని నుంచైనా వైరస్ ఈ సిస్టమ్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ వైరస్ డివైజ్‌లోకి చేరగానే.. వైరస్ కాపీలను సృష్టిస్తుంది. ఆ తర్వాత యాప్స్‌ను తన అధీనంలోకి తెచ్చుకుంటుంది. తద్వారా సిస్టమ్‌లోని డేటాను దొంగిలిస్తుంది. ఈ వైరస్‌తో కేవలం మన డివైజ్‌కే కాకుండా మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారికి కూడా ప్రమాదమే. ఎందుకంటే ఇది మన డివైజ్ నుంచి మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న అందరికీ హానికరమైన ఫైల్స్‌ను పంపిస్తుంది.
ఇంటర్నెట్లో అనేక వెబ్సైట్లు, సర్వర్లపై హ్యాకర్లు వ్యూహాత్మక దాడులు చేస్తుంటారు. ఇలా ఎటాక్ చేయడానికి హ్యాకర్లకు మెషిన్ పవర్ కావాలి కదా? అందుకని డివైజ్‌ల్లోకి చొరబడి వాటిని ఆక్రమించుకుంటారు. ఆ తర్వాత వాటిని దాడులు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ బాట్స్ మన డివైజ్‌లోకి రాగానే ఏమేమి రన్ అవుతున్నాయి? ఏ సెట్టింగ్స్‌తో అవి రన్ అవుతున్నాయి అనే విషయాలను పరిశీలిస్తుంది. ఆ తర్వాత వాటిపై దాడులు చేసుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత హానికరమైన రాన్సమ్వేర్ను స్ప్రెడ్ చేయడానికి హ్యాకర్లకు సహాయపడుతుంది. కీలాగింగ్ (మనం కీబోర్డులో ఏ కీ లను ప్రెస్ చేస్తున్నామో గమనించడం ద్వారా పాస్వర్డ్లు ఇతర ముఖ్య విషయాలను గమనిస్తుంది), అలాగే స్క్రీన్‌షాట్స్ తీస్తుంది. వెబ్‌క్యామ్ యాక్సెస్ చేసి మన పర్సనల్ యాక్టివిటీలను రికార్డు చేస్తుంది. ఇతర మాల్వేర్లు డివైజ్‌ల్లోకి వచ్చేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా స్పామ్, ఫిషింగ్ మెయిల్స్‌ను ఇతరులకు పంపిస్తుంది.
ఇది చాలా ప్రమాదకరమైనది.. దీన్ని మనం గుర్తించలేం.. ఎందుకంటే ఇది చూడ్డానికి అసలైన ఫైల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఒకసారి పొరబడి ఇన్స్టాల్ చేసుకుంటే ఇక అంతే సంగతులు. ఇది మన డివైజ్‌లోకి ప్రవేశిస్తే.. మన సిస్టమ్ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. దానిపై పూర్తి నిఘాను ఏర్పాటు చేస్తుంది. దీనిద్వారా మన డేటాను దొంగలించవచ్చు. అలాగే డిలీట్ చేయవచ్చు. అంతేకాకుండా మీ డివైజ్‌ను బాట్నెట్గా కూడా మార్చుకోగలదు.
మొబైల్ లేదా కంప్యూటర్లో ఉన్న ఫొటోలు, వీడియోలు ఇతర డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి.. వాటిని తమ అధీనంలోకి తీసుకుంటుంది రాన్సమ్వేర్. ఆ తర్వాత మన ఫైల్స్‌ను ఎప్పటిలా చూసుకోవాలంటే.. హ్యాకర్లు అడిగినంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు హ్యాకర్లు మనకు ఒక డీక్రిప్టెడ్ కోడ్‌ను ఇస్తారు. 2017లో ఈ రాన్సమ్వేర్ 150 దేశాల్లోని 2 లక్షల కంప్యూటర్లపై ఒక్కరోజులోనే ఈ రాన్సమ్వేర్ దాడి చేసింది. ప్రపంచంలోనే మొదటి మొబైల్ రాన్సమ్వేర్ 2013లో వచ్చింది. అదే ఫేక్ డిఫెండర్. ఇది వచ్చేటప్పటికి మొబైల్‌పై ఎన్క్రిప్టెడ్ టెక్నిక్ ఇంకా పుంజుకోలేదు. దీంతో అప్పట్లో ఫేక్ సెక్యూరిటీ అలర్ట్ చూపించి పలు యాప్‌లు కొనేలా చేసేవాళ్లు. డివైజ్ సెట్టింగ్స్ మార్చేసి.. వాటిని తిరిగి మార్చాలనుకుంటే డబ్బులు కట్టమని డిమాండ్ చేసేవాళ్లు. ఆ తర్వాత 2014లో సింప్ లాకర్ అనే రాన్సమ్వేర్ వచ్చింది. దీనిద్వారా మొబైల్ డివైజ్‌ల్లోని మెమొరీ కార్డుల్లో ఉన్న డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి డబ్బులు అడిగేవాళ్లు.
ఈ రాన్సమ్వేర్ బారిన పడకుండా ఉండాలంటే ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసకోవాలి. అలాగే మంచి నాణ్యమైన యాంటీవైరస్ వాడాలి. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే అటాచ్మెంట్స్ ఓపెన్ చేయకూడదు. అలాగే డేటాను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవాలి.
యూజర్ల అనుమతి లేకుండా ఏదైనా యాప్ ద్వారా డివైజ్‌లోకి ప్రవేశించి, యూజర్ల డేటాను సీక్రెట్‌గా గమనిస్తుంది. తద్వారా రకరకాల యాడ్స్‌తో స్పామ్ చేస్తుంది. మామూలు యాప్స్‌లో కూడా యాడ్స్ వస్తుంటాయి. అయితే వాటి కోసం ముందుగా యూజర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ యాడ్వేర్ ద్వారా వచ్చే యాడ్స్ అసంబంద్ధంగా ఉంటాయి. యూజర్లకు విండో క్లోజ్ చేసుకునే అవకాశం ఇవ్వవు. అలాగే యూజర్‌ను ఇతర వెబ్సైట్లలోకి తీసుకెళ్లి హానికరమైన మాల్వేర్స్ ఇన్స్టాల్ అయ్యేలా చేస్తాయి.
యూజర్ల అనుమతి లేకుండా రహస్యంగా మన యాక్టివిటీని రికార్డు చేస్తాయి. అంతేకాకుండా యూజర్‌నేమ్, పాస్వర్డ్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎక్కడో ఉన్న సర్వర్‌కు అప్లోడ్ చేస్తుంది. ఈ వివరాలు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లకు చేరవేస్తుంది. ప్రపంచంలో మొదటి మొబైల్ స్పైవర్ 2007లో ఫ్లైక్సి స్పై అనే పేరుతో వచ్చింది. “మీ పార్టనర్ మీద మీకు అనుమానమా? వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారో తెలుసుకోవాలని ఉందా? అయితే ఫ్లెక్సిస్పై ట్రై చేయండి, మీ అనుమానాలు దూరం చేసుకోండి” తరహాలో దాన్ని అడ్వర్టైజ్ చేశారు. అది ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి, ఎస్ఎంఎస్లు కాపీ చేసి అటాకర్కు పంపించడం మాత్రమే చేయగలిగేది. అలా మొదలైన ఈ స్పైవేర్.. ఇప్పుడు పెగాసస్ ( Pegasus ) రూపంలో దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే లేపుతోంది.
చాలావరకు సైబర్ దాడులు ఈ స్పామ్ అండ్ ఫిషింగ్ పద్ధతిలోనే జరుగుతుంటాయి. ఇందుకోసం ముందుగా పేరున్న సంస్థలను పోలిన మెయిల్ ఐడీ లేదా నంబర్ల ద్వారా మెయిల్స్ లేదా టెక్ట్స్ మెసేజ్‌లను పంపిస్తారు. ఒకవేళ ఆ మెయిల్ లేదా మెసేజ్‌లో ఉన్న లింక్‌ను మనం పొరపాటుగా క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు. మన మొబైల్ లేదా డివైజ్‌లోని ముఖ్యమైన సమాచారంతో పాటు బ్యాంకు ఖాతాల్లో నుంచి సొమ్మును కూడా హ్యాకర్లు దోచేస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సాఫ్ట్వేర్ కంపెనీలకు దడపుట్టిస్తున్న రాన్సమ్వేర్.. దీని నుంచి కంప్యూటర్ను ఎలా కాపాడుకోవాలి?
Apple iPhone : ఐఫోన్ స్లో అవుతోందా? ఈ ట్రిక్స్ ఫాలో అయితే ఫోన్ సూపర్ స్పీడ్‌లో పనిచేస్తుంది