Phone Hacking | మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా?
Phone Hacking | పెగాసస్ స్పైవేర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు మన స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్‌కు గురైందా లేదా ఎలా తెలుసుకోవాలి..
Phone Hacking | పెగాసస్ స్పైవేర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలోని పెద్ద పెద్ద నేతలు అందరూ తమ ఫోన్ హ్యాకింగ్‌కి గురైందని ఆరోపిస్తున్నారు. ఫోన్ కాల్ మాట్లాడాలంటేనే భయమేస్తోందంటూ చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మన స్మార్ట్‌ఫోన్ హ్యాకింగ్‌కు గురైందా లేదా ఎలా తెలుసుకోవాలి.. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? హ్యాకింగ్‌కు గురైతే ఏం చేయాలి? వంటి వివరాలను ఒకసారి తెలుసుకుందాం..

ఎలా గుర్తించాలి?
యాడ్స్ ఎక్కువగా కనిపిస్తే : స్మార్ట్‌ఫోన్ స్పైవేర్ దాడికి గురైతే యాడ్స్ ఎక్కువగా డిస్ప్లే అవుతుంటాయి. అశ్లీల యాడ్స్ ఎక్కువగా కనిపించినా.. డిస్ప్లే అయినా యాడ్స్‌ను క్లోజ్ చేసే సదుపాయం లేకపోయినా అనుమానించాల్సి ఉంటుంది. ఇలాంటి స్పైవేర్‌ను యాడ్వేర్ అని కూడా పిలుస్తారు.
తెలియకుండా యాప్స్ ఇన్స్టాల్ అయితే: మీ మొబైల్లో మీకు తెలియకుండానే ఏవైనా యాప్స్ ఇన్స్టాల్ అవుతున్నా, ఓపెన్ చేసిన యాప్స్ తరచూ క్లోజ్ అవుతున్నా కూడా అనుమానించాల్సి ఉంటుంది. ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు సడెన్‌గా ఆ యాప్ ఐకాన్ మాయమైపోతుందా? అలా అయినా కూడా మీ మొబైల్ హ్యాకర్స్ బారిన పడినట్టే. ఎందుకంటే అప్పటికే మీ ఫోన్లో ఉన్న ప్రమాదకరమైన మాల్వేర్ ఇలా యాప్ ఐకాన్స్‌ను మాయం చేస్తుంటుంది.

తొందరగా డేటా అయిపోతుందా : ముఖ్యంగా రోజు మొత్తం వచ్చే డేటా తొందరగా ఖర్చయిపోతున్నా అనుమానించాల్సిందేనని అమెరికాకు చెందిన సెక్యూరిటీ సాఫ్ట్వేర్ సంస్థ నార్టన్ హెచ్చరిస్తుంది. డేటా అయిపోవడంతో పాటు మొబైల్ బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుందంటే.. ఫోన్ హ్యాకింగ్‌కు గురైనట్లేనని చెబుతోంది.
ఫోన్ స్లో అవుతుంటే.. : సైబర్ నేరగాళ్లు ఫోన్‌ను హ్యాక్ చేసి ఏదైనా అప్లికేషన్లను చొప్పించినట్లయితే.. ఆ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ ఉంటుంది. దీంతో ఆ భారం ఫోన్ ప్రాసెసింగ్ పవర్ మీద పడి ఫోన్ వేగం తగ్గిపోతుందని కాస్పరెస్కీ సంస్థ చెబుతోంది. కాబట్టి ఫోన్ స్పీడ్ తగ్గినా కూడా హ్యాకింగ్ గురైందని అనుమానించాల్సి ఉంటుంది. ఇక మీ మెయిల్ ఐడీ లేదా ఇతర సోషల్ మీడియా అకౌంట్లు.. మీకు సంబంధం లేని లొకేషన్లలో ఓపెన్ చేయడానికి ప్రయత్నించినట్లు గుర్తిస్తే కూడా వెంటనే అప్రమత్తం అవ్వాలి.
మిస్డ్ కాల్స్ వస్తుంటే.. : తెలియని నంబర్ల నుంచి మిస్డ్ కాల్స్ వస్తుంటే.. ముఖ్యంగా ఇతర దేశాల నంబర్ల నుంచి ఎక్కువగా కాల్స్ వస్తుంటే అప్రమత్తం కావాల్సిందే. వెంటనే ఫోన్‌ను ఒకసారి చెక్ చేయించుకోవాలి.

హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్స్ నుంచి మాత్రమే యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. థర్డ్ పార్టీ యాప్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు.
- అపరిచితుల నుంచి వచ్చే మెయిల్స్, మెసెజ్ల్లోని లింకులను ఓపెన్ చేయవద్దు. అటాచ్మెంట్లను డౌన్లోడ్ చేయకూడదు. వాటిలో మాల్వేర్ ఉండే అవకాశం ఉంది.
- వైఫై, బ్లూటూత్ ద్వారా హ్యాకింగ్ చేయడం చాలా సులువు. కాబట్టి అవసరం లేని సమయంలో మొబైల్లో వైఫై, బ్లూటూత్ రెండింటినీ ఆఫ్ చేసి ఉంచుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వైఫైకి కనెక్ట్ చేసుకోకపోవడం ఉత్తమం.
- ఫోన్లోని యాప్స్‌ను సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం వల్ల హ్యాకింగ్ బారిన పడకుండా ఉండవచ్చు.

Phone Hacking గురైందని తెలిస్తే ఏం చేయాలి?
మీ ఫోన్ హ్యాక్ అయినట్లు తెలిస్తే అనుమానం కలిగించే అప్లికేషన్లను అన్ఇన్స్టాల్ చేయాలి. వేరే డివైజ్‌లో లాగిన్ అయి మెయిల్, సోషల్ మీడియా అకౌంట్ల పాస్‌వర్డ్‌లను మార్చేయాలి. ఆ తర్వాత ఫోన్‌ను రీసెట్ చేయాలి. దీంతోపాటు మీ కాంటాక్ట్స్ అందరికీ సమాచారం ఇవ్వడం మాత్రం మరిచిపోవద్దు. ఎందుకంటే హ్యాకర్లు.. మీ మొబైల్ నుంచి మీ కాంటాక్ట్స్‌లోకి మెయిళ్లు, మెసేజ్‌ల ద్వారా కొన్ని లింక్‌లను పంపించవచ్చు. అలా ఏదైనా మెసేజ్‌లు వచ్చి ఉంటే ఆ లింకులను క్లిక్ చేయవద్దని సూచించాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Apple iPhone : ఐఫోన్ స్లో అవుతోందా? ఈ ట్రిక్స్ ఫాలో అయితే ఫోన్ సూపర్ స్పీడ్‌లో పనిచేస్తుంది
Best Smartphones under Rs.10000: రూ.10 వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే
సాఫ్ట్వేర్ కంపెనీలకు దడపుట్టిస్తున్న రాన్సమ్వేర్.. దీని నుంచి కంప్యూటర్ను ఎలా కాపాడుకోవాలి?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

