Apple iPhone : ఐఫోన్ స్లో అవుతోందా? ఈ ట్రిక్స్ ఫాలో అయితే ఫోన్ సూపర్ స్పీడ్‌లో పనిచేస్తుంది
Apple iPhone : ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఫోన్లకు ఉన్న పాపులారిటీ మరే ఫోన్లకు లేదు. ఆ ఫోన్లకు ఉన్న క్రేజే వేరు. యాపిల్ ఫోన్లో ఉండే ఫీచర్స్ కానీ.. దాని పర్ఫార్మెన్స్ కానీ సూపర్‌గా ఉంటుంది. దాని లుక్కు కూడా అద్భుతంగా ఉంటుంది. అందుకే.. యాపిల్ ఫోన్లు అంటే ఎగబడతారు జనాలు. అయితే.. ఐఫోన్లలో వచ్చే ఒకే ఒక్క సమస్య. ఫోన్ స్లో అవ్వడం.. సంవత్సరాల కొద్దీ ఫోన్‌ను వాడటం వల్ల ముందు మెమోరీ ఫుల్ సమస్య.. ఆ తర్వాత ఫోన్ కొంచెం స్లో అవుతుంది. యాప్స్ ఓపెన్ కావడానికి కాస్త సమయం తీసుకుంటుంది. అటువంటుప్పుడు ఐఫోన్ యూజర్లు కాస్త ఇబ్బంది ఫీల్ అవుతారు. ఫోన్ స్లో అవ్వడం వల్ల చిరాకు పడతారు. ఫోన్లో అనవసరమైన డాక్యుమెంట్లు, మీడియా ఫైల్స్, కాష్ మెమోరీ, అనవసరమైన యాప్స్ వల్ల ఫోన్ ఒక్కోసారి స్లో అవుతుంటుంది. ఫోన్లో బ్రౌజింగ్ ఎక్కువగా చేసినా.. వెబ్ సైట్లకు చెందిన కాష్ మెమోరీ.. ఎప్పటికప్పుడు ఫోన్లలో స్టోర్ అవుతుంటుంది. దాని వల్ల మెమోరీ ఫుల్ అవ్వడం, ఫోన్ స్లో అవడం జరుగుతుంటుంది.

అందుకే.. ముందు మీరు చేయాల్సింది ఏంటంటే.. ఫోన్లోని సెట్టింగ్స్‌కు వెళ్లి జనరల్ ఆప్షన్‌ను క్లిక్ చేసి ఐఫోన్ స్టోరేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఐఫోన్ స్టోరేజ్ బ్రేకప్ మొత్తం అక్కడ కనిపిస్తుంది. మీకు అవసరం లేని జంక్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయో అక్కడ చెక్ చేసుకోవచ్చు. దీంతో మెమోరీ ఫ్రీ అవుతుంది.
Offload Apps
ఫోన్లో కొంత మెమోరీని క్లీన్ చేయాలనుకుంటే.. మీ డివైజ్‌లో ఆఫ్‌లోడ్ యాప్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఆఫ్‌లోడ్ యాప్స్ అంటే.. యాప్ మీ డివైజ్ నుంచి అన్ ఇన్స్టాల్ అవుతుంది కానీ దానికి సంబంధించిన ఫైల్స్ మాత్రం మీ ఫోన్లోనే ఉంటాయి. భవిష్యత్తులో ఆ యాప్‌ను మళ్లీ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే.. ఫోన్ మెమోరీని ఉపయోగించకుండా.. ఇదివరకే ఉన్న ఫైల్స్‌తో ఇన్స్టాల్ అవుతుంది. దానికోసం సెట్టింగ్స్‌లో ఐఫోన్ స్టోరేజ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి ఏ యాప్‌ను అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
Delete old messages
డీఫాల్ట్‌గా ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లు ఐఫోన్లోనే స్టోర్ అవుతుంటాయి. కొన్ని రోజుల తర్వాత కేవలం మెసేజ్‌లకే ఎక్కువ మెమోరీ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే.. పాత మెసేజ్‌లు, అవసరం లేని మెసేజ్‌లు అన్నీ డిలీట్ చేసేయండి. దానివల్ల.. మెమోరీ స్పేస్ పెరుగుతుంది.
Delete Browser Cache
బ్రౌజర్లో ఇంటర్నెట్ను బ్రౌజ్ చేయడం వల్ల.. చాలా కాష్ ఫైల్స్ బ్రౌజర్లో సేవ్ అవుతాయి. ఏదైనా ఒక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసినా.. ఆ వెబ్‌సైట్‌కు సంబంధించిన కాష్ ఫైల్స్ బ్రౌజర్ మెమోరీలో సేవ్ అవుతాయి. కొన్ని ఫోన్ మెమోరీలో కూడా స్టోర్ అవుతుంటాయి. అందుకే.. రెగ్యులర్‌గా బ్రౌజర్ కాష్ను క్లియర్ చేస్తూ ఉండాలి. దానికోసం సఫారీ బ్రౌజర్ ఉపయోగించేవాళ్లు.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి సఫారీని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత క్లియర్ హిస్టరీ అండ్ వెబ్ సైట్ డేటా అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని స్పేస్‌ను క్లియర్ చేయండి. అలాగే.. అనవసరమైన బ్రౌజర్ టాబ్స్ ఏవైనా ఉంటే క్లోజ్ చేయండి. ఎందుకంటే.. అవి కూడా ఎక్కువ స్పేస్ తీసుకొని ఫోన్‌ను స్లో చేస్తాయి. రెగ్యులర్‌గా ఈ టిప్స్ ఫాలో అవుతూ.. మెమోరీని క్లీన్ చేస్తూ ఉంటే.. ఫోన్ వేగం పెరుగుతుంది. ఫాస్ట్‌గా రన్ అవుతుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

