న్యూఢిల్లీ : దేశీ మార్కెట్లో వివో వీ27 సిరీస్‌ను (Vivo V27) వివో లాంఛ్ చేసింది. వి27 సిరీస్‌లో భాగంగా వివో వి27, వివో వీ27 ప్రొను కంపెనీ ప్రవేశపెట్టింది. గత ఏడాది లాంఛ్ చేసిన వీ25 సిరీస్‌కు కొనసాగింపుగా న్యూ లాంఛ్‌తో కంపెనీ కస్టమర్ల ముందుకొచ్చింది. యూనిక్ కలర్ ఛేంజింగ్ బ్యాక్ ప్యానెల్‌తో, కర్వ్డ్ డిస్ప్లేతో వివో వీ27 సిరీస్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, వెనుకభాగంలో ట్రిపుల్ కెమెరా సెన్సర్లు వంటి ఫీచర్లతో వి27 సిరీస్ దేశీ మార్కెట్లోకి ఎంటరైంది. వివో లేటెస్ట్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్ఓసీ చిప్సెట్తో ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌పై రన్ అవుతాయి. ఈ ఫోన్లు 66డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌ను కలిగిఉన్నాయి. మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభించే వివో వీ27 ప్రొ బేస్ మోడల్ రూ. 37,999 కాగా ఇతర వేరియంట్లు వరుసగా రూ. 39,999, రూ. 42,999కు అందుబాటులో ఉంటాయి.
లేటెస్ట్ వివో వి27 సిరీస్ ఫోన్లు నోబుల్ బ్లాక్, మేజిక్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తాయి. ఈ ఫోన్లకు ప్రీ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభం కాగా, మార్చి 6 నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉంటాయి. ఇక వివో వీ27 బేస్ మోడల్ రూ. 32,999 నుంచి లభిస్తుంది. ఈ ఫోన్ మార్చి 23 నుంచి అందుబాటులో ఉంటుంది.
లేటెస్ట్ సిరీస్‌పై వివో పలు ఆఫర్లు ప్రకటించింది. ఐసీఐసీఐ, కొటాక్, హెచ్డీబీ బ్యాంకు కార్డులపై రూ. 3500 వరకూ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. ఆన్లైన్లో కొనుగోలు చేసేవారికి హెచ్డీఎఫ్సీ, కొటాక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై రూ. 3000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుండగా రూ. 2500 వరకూ ఎక్స్ఛేంజ్ బోనస్ వివో ఆఫర్ చేస్తోంది.
Read More :