Realme GT 3 | 240డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రియల్‌మి జీటీ 3 లాంఛ్
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) వేదికగా రియల్‌మి జీటీ 3ను (Realme GT 3) రియల్‌మి లాంఛ్ చేసింది.
న్యూఢిల్లీ : మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) వేదికగా రియల్‌మి జీటీ 3ను (Realme GT 3) రియల్‌మి లాంఛ్ చేసింది. మొబైల్ ఇండస్ట్రీలో తొలిసారిగా 240డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రియల్‌మి జీటీ 3 కస్టమర్ల ముందుకు రానుంది. లేటెస్ట్ రియల్‌మి ఫోన్ వెనుకభాగంలో నథింగ్ ఫోన్ 1 తరహాలో రెక్టాంగిల్ ఎల్ఈడీ లైట్ ఆకట్టుకుంటుంది.స్మార్ట్‌ఫోన్‌కు నోటిఫికేషన్స్, అలర్ట్స్ రాగానే ఫోన్ వెనుక భాగంలో అమర్చిన ఎల్ఈడీ స్ట్రిప్ బ్లింక్ అవుతుంది.
ఇక రియల్‌మి జీటీ 3 4600ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. స్మార్ట్‌ఫోన్ వేగవంతంగా చార్జింగ్ కావాలని కోరుకునే వారికి రియల్‌మి జీటీ 3 మేలైన ఎంపిక కానుంది. 240డబ్ల్యూ చార్జర్ ద్వారా కేవలం 4 నిమిషాల్లోనే స్మార్ట్‌ఫోన్ 50 శాతం చార్జి అవుతుందని కంపెనీ పేర్కొంది. యూజర్లకు ఫాస్ట్ పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేసేందుకు రియల్‌మి ఫ్లాగ్షిప్ క్వాల్‌కాం చిప్‌ను వినియోగిస్తోంది. హెవీ లోడ్ పడినసమయంలో ఫోన్ టెంపరేచర్‌ను క్రమబద్ధీకరించేందుకు రియల్‌మి లేటెస్ట్ ఫోన్ స్టెయిన్లెస్ స్టీల్ వాపర్ కూలింగ్ సిస్టం కలిగిఉంది.
రియల్‌మి జీటీ 3 స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్ సపోర్ట్‌తో పాటు డాల్బీ అట్మాస్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రియల్‌మి జీటీ 3 6.74 ఇంచ్ స్క్రీన్, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కస్టమర్ల ముందుకొస్తోంది. రియర్ కెమెరా సెటప్‌లో 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్890 సెన్సర్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ సెన్సర్ ఉన్నాయి. ఇక భారత్‌లోనూ త్వరలో రియల్‌మి జీటీ 3 గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.
Read More :
ChatGPT | చాట్ జీపీటీకి పోటీగా మస్క్ ఏఐ
Spam Text | స్పామ్ మెసేజ్‌లకు చెక్.. ఇకపై సైబర్ నేరగాళ్ల మోసాలు చెల్లవు
Jio | పది నెలల్లో దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణ.. తేల్చి చెప్పిన రిలయన్స్ జియో!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

