న్యూఢిల్లీ : చాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఏఐ టూల్స్‌తో భవిష్యత్‌లో పెను ముప్పు వాటిల్లుతుందని, పెద్దసంఖ్యలో కొలువుల కోత తప్పదనే ఆందోళనల నేపధ్యంలో న్యూ టెక్నాలజీపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చాట్‌జీపీటీని జాగ్రత్తగా ఉపయోగించాలని, యూజర్లకు డిజిటల్ ముప్పు, హాని లేకుండా వారిని కాపాడే చర్యలు చేపట్టాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఏఐని భారత్ నియంత్రిస్తుందని స్పష్టం చేశారు. ఆరోగ్య నిర్ధారణ పరీక్షలు, హెల్త్ కేర్ విషయంలో వైద్య నిపుణులు చాట్‌జీపీటీని వాడటం పట్ల అప్రమత్తంగా ఉండాలని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్వీట్‌పై మంత్రి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ వేదికలను సురక్షితంగా వాడేందుకు అనువుగా డిజిటల్ ఇండియా చట్టం రూపొందించే దిశగా కసరత్తు సాగిస్తున్నామని రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
యూజర్లకు ఎలాంటి హాని లేకుండా ఉండేందుకు చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్‌ను ఆచితూచి వాడాలని హిమంత బిశ్వ శర్మ సరైన రీతిలో చెప్పారని మంత్రి సమర్ధించారు. ఉద్దేశపూర్వకంగా, యధాలాపంగా యూజర్లకు ఎలాంటి హాని తలెత్తకుండా ఏఐ వేదికలను సమర్ధంగా తీర్చిదిద్దేలా డిజిటల్ ఇండియా చట్టం ముందుకొస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
Read More :