సమోసాలు, పకోడీలు, బజ్జీలు.. వగైరా వగైరా నూనెలో వేయించిన స్నాక్స్ అంటే అందరికీ ఇష్టమే. కానీ, వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం. అందుకే నూనె అవసరం లేకుండానే కరకరలాడే స్నాక్స్ చేసి పెట్టేందుకు వచ్చేసింది బోరోసిల్ బెస్ట్డిజి ఎయిర్ ఫ్రైయర్. దీని సాయంతో ఏ ఫలహారమైనా పదిహేను నిమిషాల్లో సిద్ధం. అదీ చుక్క నూనె లేకుండానే! అవసరం అనుకుంటే కాస్త జతచేసుకోవచ్చు. ఈ ఎయిర్ ఫ్రైయర్తో బిస్కెట్లు బేక్ చేసుకోవచ్చు, కబాబ్‌లు కాల్చుకోవచ్చు, బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎనిమిది రకాల వంటలకు వీలుగా.. స్మార్ట్‌ప్యాడ్ పై రకరకాల ఉష్ణోగ్రతలను సెట్ చేసుకునే వీలుంది. శుభ్రం చేయడమూ సులభమే. వివిధ కొలతలతో అందుబాటులో ఉన్న ఈ ఎయిర్ ఫ్రైయర్ ధర రూ. 11,990. వివరాలకు myborosil.com.
పసిబిడ్డకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు తల్లిదండ్రులు. ప్రత్యేకించి నవజాత శిశువుల కోసం ఓ చిట్టి బెడ్‌ను తీసుకొచ్చింది ‘స్కిప్ హాప్స్’ సంస్థ. స్వీట్ రిట్రీట్ 2 స్టేజ్ బేబీ లాంజర్ పేరుతో వచ్చిన ఈ పడక బుజ్జి పాపాయి లేలేత చర్మానికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూస్తుంది. వయసును బట్టి వేర్వేరు లాంజ్‌లు ఉన్నాయి.
ఆరు నెలలలోపు పిల్లలకు మెత్తని కుషన్‌తో కూడిన పడకలు, ఆపై పిల్లలకు కుషన్ లేని బెడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని తేలికగాఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. రంగురంగుల బొమ్మలు వేలాడదీసేందుకు అనువుగా ఓ ఆర్చ్ కూడా ఉంది. అయితే దీన్ని వాడేముందు నియమ నిబంధనలు చదవడం తప్పనిసరి. ఈ లాంజ్ ధర రూ. 17,999. మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉంటే.. skiphop.com సందర్శించండి.
స్మార్ట్ వాచీలకు రకరకాల ఫీచర్లు జోడించి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి తయారీ సంస్థలు. అయితే మామూలు వాచీల్లోనూ స్మార్ట్ ఫీచర్లతో సరికొత్త వాచీని తీసుకొచ్చింది ప్రముఖ సంస్థ ‘విథింగ్స్’. చూసేందుకు మూమూలు చేతి గడియారాన్ని పోలి ఉన్నా.. దీనిలోనూ గుండె కొట్టుకునే వేగం, పనితీరు తెలుసుకోవచ్చు. ఈసీజీ సౌకర్యం కూడా ఉంది. ఈ వాచీ ఆన్లైన్ ధర రూ. 11,500. పూర్తి వివరాలకు withings.com క్లిక్ చేయండి.
వైవిధ్యమైన ఫర్నిచర్‌తో ఇంటికి కళ వస్తుంది. అందంతోపాటు రాజసం ఉట్టిపడే ప్రత్యేకమైన ఫర్నిచర్‌ను పరిచయం చేస్తున్నది ‘సినమన్ హోమ్స్’. ఈ సంస్థ రూపొందించిన మహారాజా కుర్చీలు వైవిధ్యమైన డిజైన్లతో ఆకట్టుకుంటున్నాయి. ఇంటీరియర్‌కి నప్పేలా రంగురంగుల చిత్రాలతో కూడిన లెదర్‌తో వీటిని తయారు చేశారు. నిండైన క్రీమ్ కలర్‌పై ఎరుపు, నీలం, నలుపు రంగుల్లో ప్రాచీన చిత్రకళను పోలిన అందమైన పెయింటింగ్స్‌ను జతచేశారు. అదే వర్క్‌తో ఇచ్చిన కుషన్ అదనపు ఆకర్షణ. రకరకాల రంగులు, డిజైన్లలోనూ అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ ధర రూ.15,000. మీరూ సేదతీరాలనుకుంటే.. cinnamonhomes.com క్లిక్ చేయండి.
“Naya mall | ఈ పవర్‌బ్యాంక్ 30 నిమిషాల్లోనే మొబైల్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తుందట !”