Brahmotsavams | అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
Brahmotsavams | తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమల : తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ( Navaratri Brahmotsa vams) అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ( TTD ) అధికారులు వెల్లడించారు. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకోసారి వచ్చే అధికమాసం సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం ఉండబోవని తెలిపారు.ఈ సందర్భంగా వాహన సేవల వివరాలను ప్రకటించారు. అక్టోబరు 11 న అంకురార్పణం, 12న బంగారు తిరుచ్చి ఉత్సవం ఉంటుందన్నారు . అదేరోజు రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు ఊరేగుతారని తెలిపారు. 13న ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనం పై , రాత్రి 7 గంటలకు హంస వాహనంపై , 14 న ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై విహరిస్తారని పేర్కొన్నారు.
అక్టోబరు 15 న ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం , 16 న ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనంపై , 17న ఉదయం హనుమంత వాహనం , సాయంత్రం పుష్పక విమానం, గజ వాహనంపై ఊరేగుతారని వెల్లడించారు. 18న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 19 న ఉదయం స్వర్ణరథంపై, రాత్రి అశ్వ వాహనంపై , 20న ఉదయం 6 గంటలకు చక్రస్నానం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

