Pregnant Woman Burnt Alive | గొడవలో స్పృహ తప్పిన గర్భిణీ.. 275 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్లి సజీవ దహనం
Pregnant Woman Burnt Alive | ఒక వివాదం వల్ల జరిగిన గొడవలో గర్భవతి అయిన మహిళ స్పృహ తప్పి పడిపోయింది. కొట్టిన వ్యక్తులు ఆమె మరణించినట్లు అనుమానించారు. దీంతో కారులో 275 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ గర్భిణీపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు.
ముంబై: ఒక వివాదం వల్ల జరిగిన గొడవలో గర్భవతి అయిన మహిళ స్పృహ తప్పి పడిపోయింది. కొట్టిన వ్యక్తులు ఆమె మరణించినట్లు అనుమానించారు. దీంతో కారులో 275 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ గర్భిణీపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. (Pregnant Woman Burnt Alive) మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ధూలే-సోలాపూర్ హైవేపై ఉన్న గరటాడ్ బారి ప్రాంతంలో ఒక గర్భిణీ మహిళ కాలిన మృతదేహం కనిపించింది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అహిల్యానగర్ జిల్లాలోని జామ్ఖేడ్ ప్రాంతంలో ఉన్న ‘సప్తసుర్ కల్చరల్ ఆర్ట్ సెంటర్’కు చెందిన ఒక వాహనాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
కాగా, ఆ సాంస్కృతిక కేంద్రంలో తలెత్తిన అంతర్గత వివాదం కారణంగా 31 ఏళ్ల పింకీ హనుమంత్ కట్కా అనే గర్భిణీ మహిళపై బీడ్ జిల్లా సమీపంలో కొందరు వ్యక్తులు కొట్టినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆమె స్పృహ కోల్పోవడంతో చనిపోయిందని భావించిన నిందితులు 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధూలేకు కారులో ఆమెను తరలించినట్లు చెప్పారు. నిర్మానుష్యమైన కొండ ప్రాంతంలో ఆ మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో స్పృహ తప్పిన ఆమె సజీవ దహనమైందని వివరించారు.
మరోవైపు గర్భిణీ మహిళ హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీస్ అధికారి తెలిపారు. మిగతా నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీస్ బృందాలు ప్రయత్నిస్తున్నాయని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

