న్యూఢిల్లీ : నెక్ట్స్ జెనరేషన్ ఫీచర్లతో అందుబాటు ధరలో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం రూ 40,000లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. కండ్లు చెదిరే డిజైన్, స్టెల్లార్ కెమెరా, మెరుగైన బ్యాటరీ లైఫ్ వంటి ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను సొంతం చేసుకోవాలనుకోవడం కాస్త ఖరీదైన వ్యవహారమే.
ప్రీమియం స్మార్ట్ఫోన్లు చవకగా అందుబాటులో ఉండవు. అయితే 40,000లోపు బడ్జెట్లో కోరుకునే ఫీచర్లతో కూడిన ప్రీమియం ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 6ఏ, నథింగ్ ఫోన్ 1, వన్ప్లస్ 10ఆర్ వంటి పలు ప్రీమియం ఫోన్లను ఓ మాదిరి బడ్జెట్తో సొంతం చేసుకోవచ్చు. ఫీచర్లతో రాజీపడకుండా అందుబాటు ధరలో ఈ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్లు బేసిక్ మోడల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
గూగుల్ పిక్సెల్ 6ఏ : రూ . 34,999
నథింగ్ ఫోన్ 1 : రూ . 32,999
షియామి 11టి ప్రొ : రూ . 34,999
వివో వీ25 ప్రొ : రూ . 35,999
వన్ప్లస్ 10ఆర్ : రూ . 34,999