e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 16, 2022
Home News క‌న్నారం పిల్లోడు.. ‘ట్రేస్ చాట్’ క‌నిపెట్టిండు..!

క‌న్నారం పిల్లోడు.. ‘ట్రేస్ చాట్’ క‌నిపెట్టిండు..!

కరీంనగర్: ఇన్నోవేషన్ విషయంలో గ్రామీణ విద్యార్థులు నగరాల్లో చదువుతున్న వారి కంటే తక్కువేం కాదని మరోసారి నిరూపించాడు క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లతో సమానంగా ఉన్న మెసెంజర్ అయిన‌ ‘ట్రేస్ చాట్’ యాప్‌ను సిద్ధం చేశాడు హుజురాబాద్‌కు చెందిన 14 ఏండ్ల క‌న్నం అభి. ప్ర‌స్తుతం 10వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న అభి.. చిన్న‌నాటి నుంచి కొత్త టెక్నాల‌జీని వాడ‌టాన్ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డేవాడు. ఈ ఇష్ట‌మే ఇప్పుడు ఆయ‌న‌తో ట్రేస్ చాట్ యాప్ త‌యారీకి పురికొల్పింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ కూడా ఆమోదించింది.

ఆండ్రాయిడ్, ఇతర స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ యాప్‌ను ఉపయోగించి చాట్ చేయవచ్చు. వీడియో, ఆడియో కాల్స్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవచ్చు. చాట్ అనుకూలించ‌డంతో పాటు అధిక నాణ్యత వీడియో, ఆడియో కాల్స్ పొంద‌డం ఈ యాప్ ప్రత్యేక లక్షణాలు.

- Advertisement -

ఇప్పటికే 100 డౌన్‌లోడ్‌లకు పైగా లాగిన్ అయిన ట్రేస్ చాట్.. 4.8 రేటింగ్‌తో ఆదరణ పొందుతున్నది. ఒక వినియోగదారు దీన్ని ప్రైవేట్ చాటింగ్‌కు ఉత్తమమైనదిగా అభివర్ణించారు. “ఈ యాప్‌ మంచి లక్షణాలను కలిగి ఉన్నందున ద‌య‌చేసి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి”అని కామెంట్స్‌ రాశాడు.

ట్రేస్ వాల్‌పేపర్ హెచ్‌డీ యాప్‌ను కూడా అభి డిజైన్ చేయ‌గా.. దీనిని కూడా సోమవారం ప్లే స్టోర్ ఆమోదించింది. 16 వేర్వేరు వర్గాలలో 500 కి పైగా వాల్‌పేపర్లు అందుబాటులో ఉన్నాయి. యాప్ యూజర్లు ఇతరులతో వాల్‌పేపర్ల‌ను షేర్‌ చేసుకోవచ్చు అని క‌న్నం అభి చెప్పారు.

హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్ నివాసి అయిన‌ అభి.. హుజురాబాద్‌లోని కేరళ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్ విద్యార్థి. అభి తండ్రి శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, తల్లి పూజ గృహిణి. సోదరి సనా నీట్ కోసం సిద్ధమవుతున్న‌ది.

వేసవి సెలవుల్లో యూట్యూబ్, ఇతర వనరుల సహాయంతో ఈ యాప్‌ను రూపొందించిన‌ట్లు అభి తెలిపాడు. ఈ యాప్ త‌యారీకి 45 రోజుల స‌మ‌యం పట్టిందని అభి చెప్పాడు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో ఆసక్తి కలిగి ఉన్నాన‌ని, ఎనిమిదో తరగతి నుంచే యూట్యూబ్‌లో మొబైల్స్, కార్లు, టెక్ ఛానెల్‌ల కోసం సెర్చ్ చేసేవాడిన‌ని చెప్పాడు. కొన్ని రోజుల క్రితం ఒక రోబోను కూడా రూపొందించి పాఠశాల స్థాయి సైన్స్ ఫెయిర్లో ప్రదర్శించినట్లు అభి తెలిపాడు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఓలి ప్రమాణ స్వీకారంపై వివాదం.. సుప్రీంకోర్టులో విచార‌ణ‌

బైడెన్ క‌న్నా క‌మ‌లా సంపాద‌న ఎక్కువ‌.. ఎంత ప‌న్ను చెల్లిస్తున్నారంటే..?!

టీకా దౌత్యానికి భారత్, దక్షిణాఫ్రికాకు చైనా మద్దతు

ఇక న్యూయార్క్‌లో దీపావళి సెలవుదినం..?

వ‌చ్చే న‌వంబ‌ర్‌లో బంగ్లాదేశ్‌లో టీమిండియా ప‌ర్య‌ట‌న‌

ముగిసిన ఎల్‌టీటీఈ శ‌కం.. చ‌రిత్ర‌లో ఈరోజు

నితీష్‌జీ.. నా కోసం పెండ్లిళ్ల‌పై నిషేధం విధించ‌రూ..?!

అధిక ర‌క్త‌పోటు.. చేయాల్సిన‌వి.. చేయ‌కూడ‌నివి

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement