టీకా ఒక మోతాదు కూడా చాలా ఉపయోగకరమే.. బ్రిటన్ అధ్యయనం
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి నివారణకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా చాలా ఉపయోగకరంగానే ఉంటుందని పరిశోధకులు తేల్చారు

లండన్ : కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి నివారణకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా చాలా ఉపయోగకరంగానే ఉంటుందని పరిశోధకులు తేల్చారు. ఒక మోతాదు తీసుకున్నప్పటికీ వ్యాప్తిని అరికట్టవచ్చని వారు పేర్కొన్నారు. లండన్‌కు చెందిన పబ్లిక్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లండ్ (పీహెచ్ఈ) నిర్వహించిన అధ్యయనంలో ఈమేరకు తేల్చారు. ప్రధానంగా ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, ఫైజర్-బయోనోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను బ్రిటన్‌లో పెద్ద ఎత్తున అందిస్తున్నారు.
టీకాలు వేసిన 14 రోజుల తర్వాత కరోనా నుంచి రక్షణ కనిపించిందని పీహెచ్ఈ గుర్తించింది.
ఒక మోతాదు వ్యాక్సిన్ ప్రమాదాన్ని 50 శాతం తగ్గిస్తుందని ఆరోగ్య మంత్రి హాంకాక్ చెప్పారు. టీకా తీసుకోవడం వల్ల మీతోపాటు మీ చుట్టుపక్కల వారిని కూడా రక్షిస్తుందనే వాస్తవాన్ని హాంకాక్ వ్యాఖ్యలు పునరుద్ఘాటిస్తున్నాయి.
బుధవారం బయటకు వచ్చిన ఈ కొత్త అధ్యయనాన్ని నిపుణులు ఇంకా పూర్తిగా సమీక్షించలేదు. 24,000 గృహాల నుంచి 57,000 మందికి పైగా అధ్యయనం సమయంలో సంప్రదించారు. వీరికి వ్యాక్సిన్ డోసు ఇచ్చారు. వీరిని టీకాలు వేయని దాదాపు మిలియన్ మందితో పోల్చారు. ఒక మోతాదు వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు వారాల తర్వాత, వ్యాధి బారిన పడే ప్రమాదం 60-65 శాతం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. కాగా, గతం అధ్యయనాల్లో రెండు వ్యాక్సిన్ల డోసులు తీసుకున్న 4 వారాల తర్వాత వ్యాప్తి ప్రమాదం 60-65 శాతం తగ్గుతుందని కనుగొన్నారు.
వ్యాధి తీవ్రత.. వ్యాప్తి ప్రమాదమూ తగ్గుతాయి
ప్రజలు సాధారణ జీవితాలకు తిరిగి రావడానికి టీకాలు చాలా ముఖ్యమైనవి అని పీహెచ్ఈ లోని ఇమ్యునైజేషన్ హెడ్ మేరీ రామ్సే చెప్పారు. టీకాలు వ్యాధి తీవ్రతను తగ్గించడమే కాకుండా నిత్యం వేలాది మంది మరణాలను నివారిస్తాయని పేర్కొన్నారు. ఇతరుల్లో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయని తమ పరిశోధనలో తేలిందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల అధికారులపై మరణించిన అభ్యర్థి భార్య ఫిర్యాదు
‘మహారాష్ట్ర లాక్డౌన్ మరో 15 రోజులు పొడగింపు’: మంత్రి రాజేష్ తోపే
కేరళలో అత్యధికంగా 32 వేల కేసులు నమోదు
వ్యాక్సిన్ తీసుకున్న అమెరికన్లకు శుభవార్త.. ఇక మాస్కులు లేకుండా తిరగొచ్చు
బ్రెగ్జిట్ తర్వాత వాణిజ్య ఒప్పందాన్ని ఆమోదించిన ఈయూ ఎంపీలు
సుప్రీం జస్టిస్ బ్లాక్ మెయిల్‌కు పాక్ ప్రభుత్వం విఫల యత్నం: బిలావాల్ భుట్టో
5 రోజుల్లోనే నిర్మించిన తొలి 3డీ ప్రింటింగ్ ఇల్లు
ఢిల్లీలో అమల్లోకి వచ్చిన ఎన్సీటీ బిల్లు
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చు : డాక్టర్ రణదీప్ గులేరియా
దమ్ముంటే నాపై పోటీ చేయాలి : సిద్దుకు కెప్టెన్ ఛాలెంజ్
ఇద్దరు నియంతలు.. ఒకరి జననం.. ఒకరి మరణం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

