Samsung Galaxy S22 | కొత్త మొబైల్ కొనేవారికి గుడ్ న్యూస్.. 5జీ స్మార్ట్‌ఫోన్‌పై 15వేలు తగ్గించిన శాంసంగ్
Samsung Galaxy S22 | కొత్త మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. గ్యాలక్సీ ఎస్ 22 సిరీస్ మొబైల్ ధరను ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ భారీగా తగ్గించింది.
Samsung Galaxy S22 | కొత్త మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. గ్యాలక్సీ ఎస్ 22 సిరీస్ మొబైల్ ధరను ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ భారీగా తగ్గించింది. దీనిపై దాదాపు రూ.15వేలు తగ్గింపు ప్రకటించింది. కొత్తగా గ్యాలక్సీ ఎస్ 23 మోడల్‌ను ఆవిష్కరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. గ్యాలక్సీ ఎస్ 22 సిరీస్ మొబైల్స్‌ను శాంసంగ్ కంపెనీ గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించింది. అప్పుడు దీని ప్రారంభ ధర రూ.72,999గా నిర్ణయించింది. ఇప్పుడు గ్యాలక్సీ ఎస్ 23 సిరీస్ మొబైల్స్‌ను రీసెంట్గా శాంసంగ్ లాంఛ్ చేసింది. కొత్త సిరీస్ ఫోన్లు ఫిబ్రవరి 17 నుంచి విపణిలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ 22 సిరీస్ మొబైల్స్‌పై రూ.15వేలు తగ్గించి రూ.57,999గా నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేసింది. ఈ సిరీస్‌లో 256 జీబీ వేరియంట్ ధరను రూ.61,999కు తగ్గించింది. ఇక ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఈ మొబైల్ కేవలం రూ.52,900కే లభిస్తుంది.
శాంసంగ్ ఎస్ 22 ఫీచర్స్ ఇవే..
స్క్రీన్ సైజ్ 6.1 అంగుళాలు, ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లే
రిఫ్రెష్ రేట్ 120హెచ్జడ్
ప్రాసెసర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1
రేర్ కెమెరా 50 మెగాపిక్సెల్ ( వైడ్ ), 12 మెగాపిక్సెల్ ( అల్ట్రా వైడ్ ), 10 మెగాపిక్సెల్ (టెలిఫొటో)
ఫ్రంట్ కెమెరా 10 మెగాఫిక్సెల్
ర్యామ్ 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజి 128జీబీ, 256జీబీ,
బ్యాటరీ కెపాసిటీ 3700ఎంఏహెచ్
Read More :
ఫిబ్రవరి 10న రియల్మీ భాగస్వామ్యంతో తొలి కోకాకోలా ఎడిషన్ ఫోన్ లాంఛ్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

