ఫిబ్రవరి 10న రియల్మీ భాగస్వామ్యంతో తొలి కోకాకోలా ఎడిషన్ ఫోన్ లాంఛ్
రియల్మీ భాగస్వామ్యంతో తొలి కోకాకోలా స్మార్ట్‌ఫోన్ లాంఛ్ కానుంది. ఫిబ్రవరి 10న భారత్‌లో రియల్మీ 10 ప్రొ కోకాకోలా ఎడిషన్‌ను లాంఛ్ చేయనున్నట్టు రియల్మీ ప్రకటించింది.
న్యూఢిల్లీ : రియల్మీ భాగస్వామ్యంతో తొలి కోకాకోలా స్మార్ట్‌ఫోన్ లాంఛ్ కానుంది. ఫిబ్రవరి 10న భారత్‌లో రియల్మీ 10 ప్రొ కోకాకోలా ఎడిషన్‌ను లాంఛ్ చేయనున్నట్టు రియల్మీ ప్రకటించింది. కోకాకోలాతో భాగస్వామ్యంతో ప్రస్తుత రీయల్మి 10 ప్రొలో కొన్ని మార్పులు చేపట్టి యూత్‌కు నచ్చేలా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నారు.
కోకాకోలాతో చేతులు కలిపిన రీయల్మి గత ఏడాది రియల్మీ జీటీ నియో 3 థార్ ఎడిషన్‌ను లాంఛ్ చేసేందుకు మార్వెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అప్‌కమింగ్ కోకాకోలా ఎడిషన్ 5జీని సపోర్ట్ చేస్తుంది. రియల్మీ 10 ప్రొను పోలినవిధంగా రియల్మీ 10 ప్రొ కోకాకోలా ఎడిషన్ డిజైన్ ఉంటుంది. లేటెస్ట్ ఫోన్ 6.7 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లేతో స్నాప్‌డ్రాగన్ 695 5జీ చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది.
డిస్ప్లే ఫుల్ హెచ్డీ డిస్ప్లేను కలిగిఉంటుంది. వెనుకభాగంలో 108 ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సర్ ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ స్నాపర్ ఉండనుంది. అండ్రాయిడ్ 13 ఆధారిత యూఐ4పై రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ 33డబ్య్లూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. యూత్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందిన ఈ డివైజ్ ధర భారత్‌లో రూ. 20,000లోపు ఉంటుందని టెక్ నిపుణుల అంచనా.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

