న్యూఢిల్లీ : రెండు కెమెరాలతో కూడిన స్మార్ట్‌వాచ్ లాంఛ్ చేసేందుకు మెటా కసరత్తు సాగిస్తోంది. ఈ వాచ్‌పై ఎప్పటినుంచో పుకార్లు షికారు చేస్తున్నా కంపెనీ నోరుమెదపలేదు. హార్డ్‌వేర్ సమస్యలతో గత ఏడాది జూన్‌లో స్మార్ట్‌వాచ్ పనులను కంపెనీ నిలిపివేసిందనే వార్తలు వచ్చాయి.
అయితే డ్యూయల్ కెమెరాలతో కూడిన స్మార్ట్‌వాచ్‌పై మెటా కసరత్తు కొనసాగుతోందని టెక్ నిపుణులు వోజ్చౌక్సీ వెల్లడించడంతో ఈ స్మార్ట్‌వాచ్ టెక్ ప్రపంచంలో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. గూగుల్ వేర్ఓఎస్కు బదులు ఈ డ్రీమ్ స్మార్ట్‌వాచ్ కస్టమ్ ఆండ్రాయిడ్ ఆధారిత ఓఎస్‌పై రన్ అవుతుందని చెబుతున్నారు. స్మార్ట్‌వాచ్ తయారీ, లాంఛ్‌పై మెటా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
Leak: A new version of the @Meta smartwatch is in development, new details and photos below👇 pic.twitter.com/mlEgEQvWp5
— Kuba Wojciechowski 🩷 (@Za_Raczke) January 31, 2023
ప్రస్తుత స్మార్ట్‌వాచ్, గతంలో లీకైన మెటా వాచ్ డిజైన్ ఒకే తరహాలో ఉంటుందని వోజ్చౌక్సీ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ట్వీట్‌తో పాటు పోస్ట్ చేసిన ఫొటోల్లో డివైజ్ ముందు, వెనుక భాగంలో కెమెరాను హైలైట్ చేశారు. మెటా స్మార్ట్‌వాచ్ క్వాల్‌కాం చిప్‌సెట్‌ను కలిగిఉంటుందని చెబుతున్నారు. యాపిల్ వాచ్ స్మార్ట్‌వాచ్ సిరీస్‌ను పోలిన విధంగా మెటా వాచ్ ఫ్లాట్ డిస్ప్లే, ఎడ్జ్‌లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇక మెటా స్మార్ట్‌వాచ్ ధర దాదాపు రూ. 44,390 ఉంటుందని అంచనా.