iPhone 14 | గూగుల్ మ్యాప్స్ అడవిలో చిక్కుకునేలా చేస్తే.. ఐఫోన్ 14 కాపాడింది
iPhone 14 |ఐఫోన్ 14లోని శాటిలైట్ కనెక్టివిటీ ( satellite connectivity ) ఫీచర్ ద్వారా ఎమర్జెన్సీ సమయంలో సిగ్నల్ లేకపోయినా SOS సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. అదే ఇప్పుడు కెనడాలో ఇద్దరి ప్రాణాలను రక్షించింది.
iPhone 14 | ఇద్దరు అమ్మాయిలు.. కారులో వెళ్తుంటే గూగుల్ మ్యాప్స్ మోసం చేసింది. దారి తప్పుగా చూపించడంతో వాళ్లు వెళ్లాల్సిన చోటుకు కాకుండా అడవిలోకి వెళ్లి తప్పిపోయారు. ఎవరినైనా కాంటాక్ట్ అవుదామంటే అక్కడ సిగ్నల్ లేకపోవడంతో నట్టడవిలోనే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. అలాంటి సమయంలో ఐఫోన్ 14 వాళ్లను కాపాడింది. శాటిలైట్ ఫీచర్ ద్వారా వాళ్ల లొకేషన్ ట్రాక్ చేసి రెస్క్యూ టీమ్‌ను వాళ్ల దగ్గరికి పంపించింది. కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఎప్పటికప్పుడు టెక్నాలజీపరంగా కొత్త కొత్త ఫీచర్లతో వస్తున్న యాపిల్ కంపెనీ ఐఫోన్ 14లోనూ సరికొత్త ఫీచర్‌ను అందించింది. అదే శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా ఎమర్జెన్సీ సమయంలో సిగ్నల్ లేకపోయినా SOS సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. అదే ఇప్పుడు కెనడాలో ఇద్దరి ప్రాణాలను రక్షించింది. అదెలా అంటే.. బ్రిటిష్ కొలంబియాలోని రాబ్సన్ వ్యాలీ ప్రాంతంలో గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ వెళ్లిన ఇద్దరు మహిళలు దారితప్పిపోయారు. అలా 20 కిలోమీటర్లు మెక్‌బ్రైడ్ అడవిలోకి వెళ్లిన తర్వాత అక్కడే చిక్కుకుపోయారు. వచ్చిన రూట్లోనే వెనక్కి వెళ్దామంటే దారి మరిచిపోయారు. ఎవరికైనా ఫోన్ చేసి తప్పిపోయిన విషయం చెబుదామంటే.. నట్టడవి కదా.. సిగ్నల్ లేదు. అలా ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. అప్పుడే అందులో ఓ అమ్మాయికి తన ఐఫోన్ 14లో ఉన్న శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ గురించి గుర్తొచ్చింది. వెంటనే తన ఫోన్ ద్వారా SOS సర్వీస్‌కు మెసేజ్ పెట్టింది. ఆ సర్వీస్ నుంచి కెనడాలోని నార్తర్న్ 911కి ఒక సందేశం వెళ్లింది. దీంతో ఐఫోన్‌లోని జీపీఎస్ టెక్నాలజీ ద్వారా వాళ్ల అడ్రస్‌ను ట్రాక్ చేసి రెస్క్యూ టీమ్ ఆ ఇద్దరినీ కాపాడారు.
ప్రస్తుతం SOS ఫీచర్ ద్వారా ఎమర్జెన్సీ సమయంలో మెసేజ్ చేసేందుకే వీలుంది. కాల్స్ చేయడం కుదరదు. ఈ ఫీచర్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రోమ్యాక్స్లో పనిచేస్తుంది. అయితే శాటిలైట్ కనెక్టివిటీకి సంబంధించి భారత్‌లో కఠిన నిబంధనలు ఉండటంతో ఈ ఫీచర్ ఇక్కడ అందుబాటులో లేదు. కేవలం అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, యూకేలో మాత్రమే ఈ ఫీచర్ ఉంది.
Read More :
Telugu Movies | ఈ వారం రిలీజవుతున్న డిఫరెంట్ జోనర్ సినిమాలివే
Siddaramaiah | రాష్ట్రపతి, ప్రధాని పదవి ఆఫర్ చేసినా బీజేపీలో చేరను : సిద్దరామయ్య
శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ముప్పు : న్యూ వెర్షన్ ఇన్‌స్టాల్‌తో లోపాలకు చెక్..!
Mrunal Thakur | కాటుక కన్నులతో మ్యాజిక్ చేస్తున్న మృణాల్ ఠాకూర్..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

