Telugu Movies | ఈ వారం రిలీజవుతున్న డిఫరెంట్ జోనర్ సినిమాలివే
ఎప్పటిలాగే ఈ వారం కూడా వినోదాన్ని అందించేందుకు బాక్సాఫీస్ వద్ద డిఫరెంట్ జోనర్ సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ వారం సందీప్ కిషన్ మైఖేల్ (Michael), అనిఖా సురేంద్రన్ బుట్ట బొమ్మ Butta Bommaతోపాటు చిత్రాలు విడుదలవుతున్నాయి.
ప్రతీ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి ఉంటుందని తెలిసిందే. ఎప్పటిలాగే ఈ వారం కూడా అభిమానులకు వినోదాన్ని అందించేందుకు డిఫరెంట్ జోనర్ సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి.
మైఖేల్ :
సందీప్ కిషన్ (Sundeep Kishan)-విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం మైఖేల్ (Michael). గ్యాంగ్ స్టర్ లవ్ ట్రాక్ నేపథ్యంలో రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న మైఖేల్ ఫిబ్రవరి 3న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, వరుణ్ సందేశ్, విజయ్ సేతుపతి, దివ్యాంక కౌశిక్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
బుట్టబొమ్మ :
కోలీవుడ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ (Anikha Surendran) టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా బుట్టబొమ్మ (Butta Bomma). సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అరకు బ్యాక్ డ్రాప్లో సాగే ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న బుట్టబొమ్మ ఫిబ్రవరి 4న విడుదల కానుంది.
ప్రేమ దేశం :

త్రిగున్, అజయ్ కథుర్వార్, మేఘా ఆకాశ్, మాయ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం ప్రేమదేశం (Prema Desam). శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. మధుబాల కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న సందడి చేయనుంది.
రైటర్ పద్మభూషణ్ :

కలర్ఫొటో ఫేం సుహాస్ టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్ (Writer Padmabhushan). షణ్ముఖ ప్రశాంత్ (డెబ్యూ) డైరెక్షన్లో ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న థియేటర్లలో గ్రాండ్గా విడుదలకు రెడీ అవుతుంది.
సువర్ణ సుందరి :
పూర్ణ, సాక్షి చౌదరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం సువర్ణ సుందరి. ఎంఎస్ఎన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం విజువల్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. జయప్రద, ఇంద్ర, రామ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

