సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ బడ్స్ ప్రో, బడ్స్ 2 ఇయర్ బడ్స్‌ను విడుదల చేసింది. సామ్సంగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఇయర్ బడ్స్‌లో ఇవి బెస్ట్ బడ్స్.. అని సామ్సంగ్ ప్రకటించింది. టీడబ్ల్యూఎస్(ట్రూ వైర్లెస్ స్టీరియో)లో కూడా ఇవే బెస్ట్ అని స్పష్టం చేసింది. అయితే.. ఈ ఇయర్ బడ్స్‌ను కొన్న కొన్ని రోజులకే చెవిలో ఇన్ఫెక్షన్ వస్తుందని కొందరు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.
సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో, గెలాక్సీ బడ్స్ 2.. ఈ రెండు మోడల్స్ ఇయర్ బడ్స్ వల్ల చెవి నొప్పి, ఇన్ఫెక్షన్ వస్తోందని సోషల్ మీడియా వేదికగా పలువురు యూజర్లు వాపోతున్నారు. ఈ ఇయర్ బడ్స్ తయారీలో సామ్సంగ్ వినియోగించిన కొత్త మెటిరియలే దీనికి కారణం అయి ఉంటుందని టెక్ నిపుణులు అనుమానిస్తున్నారు.
ఇప్పటి వరకు సామ్సంగ్ అయితే.. ఈ సమస్యపై స్పందించలేదు. కాకపోతే.. సామ్‌సంగ్‌కు ఫిర్యాదు చేసిన యూజర్లకు కంపెనీ.. మొత్తం అమౌంట్ రిఫండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సామ్సంగ్ గెలాక్సీ నుంచి వచ్చిన ఏ ఇయర్ బడ్స్ మీద కూడా ఫిర్యాదు రాలేదు. కానీ.. కొత్తగా వచ్చిన ఈ రెండు మోడల్స్ మీదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఈ మోడల్స్ తయారీలో కంపెనీ నికెల్‌తో పాటు అక్రిలేట్(acrylate ) అనే పదార్థాన్ని కూడా ఉపయోగించింది. ఇవే.. స్కిన్ ఎలర్జీ, చెవిలో ఇన్ఫెక్షన్ను కలిగిస్తున్నట్టు తెలుస్తోంది.
న్యూజెర్సీలో కొందరు యూజర్లు సామ్‌సంగ్‌పై లాసూట్ ఫైల్ చేసినట్లు టెక్ నిపుణులు వెల్లడించారు. గెలాక్సీ బడ్స్ ప్రో వల్ల అలెర్జీతో పాటు చెవిలో నొప్పి, చెవి ఎర్రబారడం, దురద పెట్టడం లాంటి సమస్యలు వస్తున్నాయని ఫిర్యాదులో వాళ్లు పేర్కొన్నారు. మరి.. ఈ ఆరోపణలపై కంపెనీ అధికారికంగా ఎప్పుడు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Redmi Note 11T 5G : రెడ్మీ నోట్ 11టీ 5జీ ఫోన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
iPhone | ఐఫోన్ 13పై రూ.25వేల తగ్గింపు.. ఎలా పొందాలంటే?
Vivo : వివో వై50టీ 48-మెగాపిక్సెల్ కెమెరా లాంఛ్..ధర ఎంతంటే!
OnePlus 10 Pro : ఫిబ్రవరిలో వన్‌ప్లస్ ప్రొ 10 లాంఛ్..ధర ఎంతంటే!
టెక్నో పాప్ 5సీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్