న్యూఢిల్లీ : వన్‌ప్లస్ 10 ప్రొ స్పెసిఫికేషన్స్, లాంఛ్ డేట్, ధర వివరాలపై తాజాగా మరో లీక్ హల్చల్ చేస్తోంది. వన్‌ప్లస్ 10 ప్రొ రియర్ సైడ్ భారీ స్వ్కేర్ కెమెరా మాడ్యూల్తో పాటు ముందుభాగంలో కర్వ్డ్ పంచ్-హోల్ డిస్ప్లేతో ఆకట్టుకోనుంది. 6.7 ఇంచ్‌ల సిర్కా డిస్ప్లేతో పాటు 125డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుందని లీక్ వెల్లడించింది.
స్నాప్‌డ్రాగన్ 839 చిప్సెట్తో ఈ డివైజ్ రానుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి ప్రధమార్ధంలో ఎంట్రీ ఇస్తుందని తెలిపింది. ఒన్‌ప్లస్ 10 ప్రొ ధర రూ 69,999 నుంచి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.