మొబైల్ ఫోన్స్‌లో ఐఫోన్ రేంజ్ వేరు. సెక్యూరిటీ నుంచి అన్ని విషయాల్లో మిగతా ఫోన్లకన్నా ఒక అడుగు ముందే ఉంటాయవి. అందుకే కొత్త ఐఫోన్ విడుదలవుతోందంటే చాలాఉ చాలా మంది ఆశగా ఎదురు చూస్తుంటారు. అయితే వాటి దరలు కూడా అదే మాదిరి ఉంటాయి. అందుకే సామాన్యులు ఆపిల్ ఫోన్లు కొనాలంటే ఆలోచిస్తారు.
అలాంటి వారికి ఒక గుడ్‌న్యూస్. ఈ నెలలో ఆపిల్ సంస్థ నుంచి ఐఫోన్ 13 సిరీస్ మొబైల్స్ విడుదలయ్యాయి. దీనిలో ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉన్నాయి. వీటిలో ఏ మొబైల్ కొనేవాళ్లు అయినా సరే.. ఆ సంస్థ ఇచ్చిన ఆఫర్లను సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ మొబైల్ ధర పాతికవేల రూపాయల వరకూ తగ్గిపోతుంది. ఈ వివరాలన్నీ ఆపిల్ అధికారిక వెబ్సైటులోనే ఉన్నాయి.
అదెలాగో ఒకసారి చూద్దామా? ఐఫోన్ 13 మార్కెట్ ధర రూ. 79,900. దీన్ని కొనుగోలు చేసే సమయంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులు ఉపయోగిస్తే రూ. 6000 ధర తగ్గుతుంది. ఈ కార్డులతో ఈఎంఐ ఆప్షన్ తీసుకున్నా ఈ తగ్గుదల దొరుకుతుంది. అంటే ఇలా చేస్తే ఐఫోన్ 13 ధర రూ.73,900కు చేరుతుంది.
అదే సమయంలో మన దగ్గర మంచి కండిషన్లో ఉన్న పాత ఐఫోన్ ఉంటే దాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం ఉంది. దీన్ని ఐస్టోర్‌లో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ఛేంజ్లో ఐఫోన్ ఎక్స్ఆర్ 64 జీబీ ధర రూ. 18వేలు పలుకుతుందని ఆ సంస్థ తెలిపింది. అదే గనుక ఐఫోన్ 11 లేదా అంతకన్నా కొత్త మోడల్స్ కనుక ఎక్స్ఛేంజ్ చేస్తే వాటి ధర మరింత ఎక్కువగా ఉంటుంది.
అంతేకాదు, ఇలా ఎక్స్ఛేంజ్ చేసినందుకు బోనస్‌గా రూ.3000 లభిస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే ఐఫోన్ 13 ధర రూ.55,900కు చేరుతుంది. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఆపిల్ ఆథరైజ్ చేసిన ట్రేడ్-ఇన్ ప్రొవైడర్లయిన కాషిఫై, సర్విఫైలోనే లభిస్తున్నాయి. మరెందుకాలస్యం మీరు కూడా ఈ ఆఫర్లపై ఒక లుక్కేయండి.