న్యూఢిల్లీ : వవివో చైనా మార్కెట్లో వై50టీ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. 5జీ ఫోన్ల లాంఛ్‌పై ఇటీవల ఫోకస్ పెట్టిన వివో తాజాగా 4జీ ఎల్టీఈ ఫోన్‌ను లాంఛ్ చేయడం గమనార్హం. రెండు కలర్స్‌లో సింగిల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో వై50టీ స్మార్ట్‌పోన్ అందుబాటులో ఉంది.
వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో 6.58 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగిఉంది. ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఫేస్ అన్‌లాక్, సైడ్ ఫేసింగ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి సెక్యూరిటీ ఫీచర్లతో ముందుకొచ్చిన ఈ స్మార్‌ఫోన్ ధర రూ 16,000 నుంచి ప్రారంభమవుతంది.