Redmi Note 11 : రెడ్మీ నోట్ 11 సిరీస్ ధర, స్పెసిఫికేషన్లు ఇవే.. రిలీజ్ డేట్ ఫిక్స్
రెడ్మీ నోట్ 11 సిరీస్ ధర, స్పెసిఫికేషన్లు ఇవే.. రిలీజ్ డేట్ ఫిక్స్ | ఎప్పుడెప్పుడా అని స్మార్ట్‌ఫోన్ అభిమానులు ఎదురు చూస్తున్న రోజు త్వరలోనే రాబోతోంది. రెడ్మీ
ఎప్పుడెప్పుడా అని స్మార్ట్‌ఫోన్ అభిమానులు ఎదురు చూస్తున్న రోజు త్వరలోనే రాబోతోంది. రెడ్మీ నోట్ 11 సిరీస్‌లో భాగంగా రెడ్మీ నోట్ 11, రెడ్మీ నోట్ 11 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ ఫోన్ల స్పెసిఫికేషన్లు, ధర తాజాగా విడుదలయ్యాయి. వచ్చే వారం అంటే అక్టోబర్ 28న రెడ్మీ నోట్ 11 సిరీస్ లాంచ్ కానున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రెడ్మీ నోట్ 11 సిరీస్ ధర, ఫీచర్ల గురించి ఆన్లైన్లో చర్చ నడుస్తోంది. రెడ్మీ నోట్ 11 సిరీస్ అన్ని ఫోన్లు 120 హెచ్‌జెడ్ డిస్ప్లేతో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రిలీజ్ కానున్నాయి.

రెడ్మీ నోట్ 11, 4 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ ధర సుమారు రూ.14000 ఉంటుందని తెలుస్తోంది. 6 జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ప్లస్ 128 జీబీ, 8 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్లలోనూ ఈ ఫోన్ లభిస్తుంది. రెడ్మీ నోట్ 11 ప్రో 6 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.18700 కాగా.. 8 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.21000, 8 జీబీ ప్లస్ 256 జీబీ ధర రూ.23,400 గా ఉండనుంది. రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ ఫోన్ ధర 8 జీబీ ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.25,700 గా ఉండనుంది. 8 జీబీ ప్లస్ 256 జీబీ మోడల్ ధర రూ.29,200 గా ఉంటుందని తెలుస్తోంది.
రెడ్మీ నోట్ 11 స్పెసిఫికేషన్స్
6.5 ఇంచ్ ఫుట్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఎస్వోసీ ప్రాసెసర్, 50 ఎంపీ రేర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్‌సీ పోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లు రెడ్మీ నోట్ 11 లో ఉండనున్నాయి.
రెడ్మీ నోట్ 11 ప్రో స్పెసిఫికేషన్లు
ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 920 ఎస్వోసీ ప్రాసెసర్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 108 ఎంపీ సామ్సంగ్ ప్రైమరీ సెన్సార్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లు రెడ్మీ నోట్ 11 ప్రోలో ఉండనున్నాయి.
రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు
120 హెచ్‌జెడ్ ఫ్లెక్సిబుల్ ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఏఐ ఎస్వోసీ, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 108 ఎంపీ ప్రైమరీ సామ్సంగ్ హెచ్ఎమ్2 సెన్సార్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ఫీచర్లతో రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ రిలీజ్ కానుంది.
రెడ్మీ నోట్ 11 సిరీస్ అక్టోబర్ 28న చైనాలో రిలీజ్ అయిన తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రెడ్మీ నోట్ 11 సిరీస్‌తో పాటు అక్టోబర్ 28న రెడ్మీ వాచ్ 2 స్మార్ట్‌వాచ్ కూడా విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆపిల్ ఆఫర్.. ఇండియాలో ఇంటెర్న్ల కోసం చూస్తున్న టెక్ జెయింట్
Facebook plans to change name | ఫేస్బుక్ పేరు త్వరలో మారబోతున్నదా
Smallest Game console : ఇది ప్రపంచంలోనే అతిచిన్న గేమ్ కన్సోల్..!
Telegram : సరికొత్త చరిత్ర సృష్టించిన టెలిగ్రామ్.. వాట్సాప్ కు దీటుగా..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | మాటల విషయంలో తప్పు తెలుసుకున్న సాయిపల్లవి.. ఇకపై ఆచితూచి మాట్లాడతానంటూ కీలక వ్యాఖ్యలు!
Qeshm Island: ఇరాన్‌లోని ఖాసిం దీవిపై అమెరికా అటాక్
డాలస్‌లో ఘనంగా కొసరాజు సాహిత్య సంపుటాల ఆవిష్కరణ
Sai Durga Tej | మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. త్వరలో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం,పెళ్లి తేదీ కూడా ఖరారైందా?
AP News | ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. రాత్రి 8 గంటలకల్లా పూర్తి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

