గురువారం 13 ఆగస్టు 2020
Science-technology - Aug 01, 2020 , 15:48:10

రియల్‌మి వైర్‌లెస్ ఛార్జర్ వచ్చేసింది

రియల్‌మి వైర్‌లెస్ ఛార్జర్ వచ్చేసింది

న్యూఢిల్లీ:  చైనీస్ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మి భారత్‌లో ఇవాళ  వైర్‌లెస్‌ ఛార్జర్‌ను ఆవిష్కరించింది.  రియల్‌మి 10W వైర్‌లెస్‌ ఛార్జర్‌ను రూ.899 ధరతో అందుబాటులోకి తీసుకొచ్చింది.  ప్రస్తుతం ఈ ఛార్జర్‌న కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు. సర్క్యులర్‌ డిజైన్‌లో ఉన్న  ఛార్జింగ్‌ ప్యాడ్‌ మధ్యలో  రియల్‌మి బ్రాండ్‌ను ముద్రించారు. ఛార్జర్‌ కేవలం గ్రే కలర్‌లో మాత్రమే లభిస్తుంది.  ఇతర డివైజ్‌లు 10W వరకు ఛార్జింగ్‌ చేయగల యూఎస్‌బీ టైప్‌ సీ కేబుళ్లకు సపోర్ట్‌  చేస్తుంది. 

 10W వైర్‌లెస్ ఛార్జర్  అంతర్జాతీయంగా  ఆమోదించబడిన Qi  ఛార్జింగ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు.  ఈ ఛార్జర్‌తో రియల్‌మి బడ్స్‌ ఎయిర్‌తో సహా ఫోన్‌లు ఇతర డివైజ్‌లను ఛార్జ్‌ చేసుకోవచ్చు. త్వరలో భారత్‌లో 65W,  50W రియల్‌మి ఆల్ట్రా థిన్‌ సూపర్‌ డార్ట్‌ ఛార్జర్‌ మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 


logo