రామయ్య సేవలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా
బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు భద్రాచలం సీతారామచంద్రస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. బుధవారం నామినేషన్ వేయనున్న నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
భద్రాచలం/దమ్మపేట, ఏప్రిల్ 23: బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు భద్రాచలం సీతారామచంద్రస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. బుధవారం నామినేషన్ వేయనున్న నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ధ్వజస్తంభం వద్ద నమస్కరించుకొని అంతరాలయంలోని మూలవరులకు పూజలు చేసిన ఆయన.. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలను సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, తాళ్లూరి జీవన్, మోరంపూడి ప్రసాద్, బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ ఉన్నారు.
అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దే..
రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కేసీఆర్‌దేనని నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని మామిడి తోటలో మంగళవారం ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మోసపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్‌కి.. పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. భద్రాచలం నుంచి కొవ్వూరు రైల్వే లైన్‌కు సింగరేణితో రాష్ట్ర వాటా నిధులు ఇప్పించి సత్తుపల్లి వరకు రైల్వేలైన్ పూర్తి చేయడమే అభివృద్ధిపై కేసీఆర్కున్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు మట్టి, ఇసుక దందాతో దోచుకునే పనిలో బిజీగా ఉన్నారని, యాసంగిలో పండించిన ధాన్యం కొనే దిక్కులేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రజలను దగా చేయడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉన్నదని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

