లక్నో: నకిలీ గుర్తింపులతో 25 వివాహాలు చేసుకుని అనేక మంది మహిళలను మోసం చేసిన ఒక వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసేలా తమను మోసగించారని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఆయన ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేయడంతో పాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు. (BJP MLA Daughter Duped) ఉత్తరప్రదేశ్లోని సేవత నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ ఆగస్ట్ 6న సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. 2024లో మిశ్రిఖ్లోని చంద్రవాల్ ప్రాంతానికి చెందిన అనుజ్ త్రివేది కుమారుడు ప్రఖర్ త్రివేదితో తన కుమార్తె ప్రజ్ఞ పెళ్లి జరిగినట్లు తెలిపారు. వివాహ సమయంలో ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అనుజ్ త్రివేది చెప్పుకున్నారని, ఆయనకు ఉన్న నేర చరిత్ర, గతంలో నమోదైన కేసుల వివరాలను దాచిపెట్టారని ఆయన ఆరోపించారు.
కాగా, వివాహం జరిగిన సుమారు రెండేళ్లన్నర తర్వాత అల్లుడు ప్రఖర్ త్రివేదికి సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు, ఆ కుటుంబం గురించి సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా అసలు సమాచారం తెలిసిందని బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తెలిపారు. మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాల్లోని పలువురు మహిళలను నకిలీ గుర్తింపులతో ఆకర్షించి 25 వివాహాలు చేసుకున్నాడని, ప్రేమ పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసినట్లు అల్లుడు ప్రఖర్పై ఆయన ఆరోపించారు. ప్రఖర్ కుటుంబంతో అన్ని సామాజిక, వ్యక్తిగత సంబంధాలను తెంచుకున్నానని, తన కుమార్తెను తిరిగి ఇంటికి తీసుకువచ్చానని ఆయన చెప్పారు.
మరోవైపు ఈ వ్యవహారం తన కుటుంబానికి తీవ్ర మానసిక వేదన కలిగించిందని, ప్రజాప్రతినిధిగా తన సామాజిక ప్రతిష్టను దెబ్బతీసిందని ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ వాపోయారు. అనుజ్ త్రివేదికి మరణశిక్షతో సహా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. తన అల్లుడు దోషిగా తేలితే, చట్టం ప్రకారం కఠిన శిక్ష అనుభవించాలని ఆయన అన్నారు.
అయితే బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ ఫిర్యాదు మేరకు అనుజ్ త్రివేది, ప్రఖర్ త్రివేదిపై మోసం కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు రేయుసా పోలీసులు తెలిపారు. వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
BJP MLA Alleges Fraud by Son-in-Law, Seeks Strict Action
BJP MLA Gyan Tiwari from Uttar Pradesh’s Seuta constituency has released a video with his daughter, accusing his son-in-law and the latter’s father of fraud, cheating and several other serious offences.
An emotional… pic.twitter.com/AMHH4p56iL
— Atulkrishan (@iAtulKrishan1) August 6, 2026