Realme GT 2 | ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్మీ తాజాగా రియల్మీ జీటీ 2 సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్మీ జీటీ 2, రియల్మీ జీటీ 2 ప్రో ఫోన్లను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్లు టాప్ ఎండ్ ఫీచర్లను కలిగి ఉండనున్నాయి. టాప్ ఎండ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ఎస్వోసీ, అండర్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా లాంటి బెస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇండియన్ టైమ్ ప్రకారం.. ఇవాళ మధ్యాహ్నం 2.30కే ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఫోన్ లాంచ్ ఈవెంట్‌ను యూట్యూబ్‌లో లైవ్‌స్ట్రీమ్ ఏర్పాటు చేశారు. రియల్మీ జీటీ 2 ధర సుమారు రూ.47,700 ఉండనుంది. జీటీ 2 ప్రో ధర రూ.59,600 గా ఉండనుంది.
జీటీ2 ప్రోను త్వరలో రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ నెల ముందే ప్రకటించింది. జీటీ 2, జీటీ2 ప్రో ఫీచర్లు దాదాపుగా ఒకటే ఉండనున్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ఎస్వోసీ ప్రాసెసర్, 6.8 ఇంచ్ డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 50 ఎంపీ కెమెరా, 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్, 150 డిగ్రీ అల్ట్రా వైడ్ షూటర్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్లు లాంచ్ అయ్యాయి.
అయితే.. ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో.. సేల్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయో మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Redmi | వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెడ్మి కే50 సిరీస్ లాంఛ్!
ఏడాది చివరిలో మెగా లైనప్ : ఈనెల 28న షియోమి 12 సిరీస్ లాంఛ్!
Shining Mask: కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
Signal | వాట్సప్‌కు దీటుగా దూసుకెళ్తున్న సిగ్నల్.. మరో అద్భుతమైన ఫీచర్