న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షియోమి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెడ్మి కే50 సిరీస్‌ను లాంఛ్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది అదే సమయంలో రెడ్మి కే40 సిరీస్‌ను షియోమి లాంఛ్ చేసింది. మధ్యశ్రేణి స్మార్ట్‌ఫోన్ సిరీస్‌గా రెడ్మి కే50 సిరీస్‌ను షియోమి లాంఛ్ చేస్తుండటంతో లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ఎస్ఓసీ స్ధానంలో ఈ లైనప్‌కు డైమెన్సిటీ 8000 చిప్‌సెట్‌ను వాడుతోంది.
రియల్‌మి జీటీ నియో 3 కూడా ఇదే చిప్సెట్తో రానుందని లీకర్ డిజిటల్ ఛాట్ స్టేషన్ వెల్లడించింది. రెడ్మి కే50 సిరీస్ క్యూహెచ్డీ+ డిస్ప్లే సపోర్ట్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. రెడ్మి కే50 సిరీస్‌లో భాగంగా కే50, కే50ప్రొ, కే50 ప్రొ+, కే50 గేమింగ్ వంటి నాలుగు మోడల్స్ రానున్నాయి.
వీటిలో రెడ్మి కే50 ప్రొ+ ప్రీమియం మోడల్ కాగా పెరిస్కోప్ టెలిఫోటో యూనిట్‌తో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇక రెడ్మి కే50 గేమింగ్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో రానుందని అంచనా.