Signal | ప్రముఖ మెసేజింగ్ యాప్ సిగ్నల్ సరికొత్త ఫీచర్లతో దూసుకుపోతోంది. ఇతర మెసేజింగ్ యాప్స్ వాట్సప్, టెలిగ్రామ్‌కు దీటుగా ఎదుగుతోంది. బెస్ట్ ఫీచర్లను యాడ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా గ్రూప్ వీడియో కాలింగ్‌లో యూజర్ల లిమిట్‌ను పెంచుతున్నట్టు సిగ్నల్ ప్రకటించింది.
ఇప్పుడు గ్రూప్ వీడియో కాల్లో 40 మంది వరకు యూజర్లను యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ వర్షన్లలో తీసుకొస్తోంది.
ఎన్ని ఫీచర్లను తీసుకొచ్చినా.. యూజర్ల ప్రైవసీ విషయంలో మాత్రం తగ్గేదే లే అని సిగ్నల్ ఈసందర్భంగా స్పష్టం చేసింది. గ్రూప్ వీడియో కాల్ ద్వారా యూజర్ల ప్రైవసీని కాపాడటం కోసం సెలెక్టివ్ ఫార్వార్డ్ టెక్నాలజీని ఉపయోగించినట్టు సిగ్నల్ తెలిపింది.
గత కొన్ని రోజుల కింద మరో మెసేజింగ్ యాప్ వాట్సప్ సేవల్లో పలుసార్లు అంతరాయం కలగడంతో భారత యూజర్లు సిగ్నల్ వైపు మళ్లారు. అప్పటి నుంచి సిగ్నల్‌కు భారత్‌లో పాపులారిటీ పెరిగిపోయింది.
వాట్సప్‌లో కూడా వీడియో కాల్లో 8 మంది కంటే ఎక్కువ యాడ్ చేసే అవకాశం లేదు. టెలిగ్రామ్‌లో మాత్రం గ్రూప్ వీడియో కాల్లో 1000 మంది యూజర్ల వరకు యాడ్ అవ్వొచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Fake PAN Card | నకిలీ పాన్‌కార్డును గుర్తించడం ఎలా? స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఇదిగో స్టెప్స్
బేసిక్ ఫీచర్లతో రగ్గ్డ్ లుక్‌లో ప్లేఫిట్ స్ట్రెంగ్త్ స్మార్ట్‌వాచ్
Micromax : ప్లిఫ్‌కార్ట్‌లో మైక్రోమ్యాక్స్ ఐఎన్ 2బీపై డిస్కౌంట్
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? వెంటనే అప్డేట్ చేసుకోండి.. ఆదేశించిన కేంద్రం
త్వరలో ఆండ్రాయిడ్ 12 ఓఎస్ లాంచ్.. ప్రకటించిన గూగుల్.. ఫీచర్లు ఇవే