ఇంటర్నెట్ను యాక్సెస్ చేసుకోవాలంటే.. ఏదైనా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఒక బ్రౌజర్ కావాల్సిందే. చాలామంది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని గూగుల్ బ్రౌజర్.. గూగుల్ క్రోమ్ వాడుతుంటారు. ఎక్కువ శాతం మంది యూజర్లు గూగుల్ క్రోమ్‌ను ఉపయోగిస్తుండటంతో సైబర్ క్రిమినల్స్.. క్రోమ్‌ను టార్గెట్ చేసుకున్నారు.
గూగుల్ క్రోమ్ ద్వారా సిస్టమ్స్‌ను టార్గెట్ చేసి టార్గెటెడ్ సిస్టమ్స్‌ను మాల్వేర్తో సైబర్ క్రిమినల్స్ అటాక్ చేస్తున్నట్టు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) స్పష్టం చేసింది. ఇది కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తుంది. దీంతో అందరు గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ బ్రౌజర్ యూజర్లకు సీఈఆర్టీ ఇండియా వెంటనే హెచ్చరికలు జారీ చేసింది.
వెంటనే యూజర్లంతా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలంటూ తెలిపింది. గూగుల్ ఇప్పటికే.. హ్యాకర్స్ పంపించే ఆర్బిట్రరీ కోడ్‌ను డిటెక్ట్ చేసి.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఫిక్స్ చేసింది. దీంతో వెంటనే యూజర్లు క్రోమ్ బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలంటూ వెల్లడించింది. వెంటనే క్రోమ్‌ను అప్డేట్ చేసుకొని లేటెస్ట్ వర్షన్‌ను వాడాలని లేకపోతే సైబర్ క్రిమినల్స్ బారిన పడే ప్రమాదం ఉందని సీఈఆర్టీ ఇండియా స్పష్టం చేసింది.
22 రకాల సెక్యూరిటీ ఫిక్స్‌లను క్రోమ్ బ్రౌజర్లో ఎంబెడ్ చేసినట్టు గూగుల్ తెలిపింది. ఇవి యూజర్ల ప్రైవసీని పెంచుతాయని గూగుల్ వెల్లడించింది.
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మాక్, లైనక్స్ వాడేవాళ్లు క్రోమ్ స్టేబుల్ చానెల్ 96.0.4664.93కి అప్డేట్ చేసుకోవాలి.
వీ8లో టైప్ కన్ఫ్యూజన్ వల్ల రకరకాల మాల్వేర్స్ గూగుల్ క్రోమ్‌ను అటాక్ చేస్తున్నాయి. అలాగే.. సెక్యూరిటీ యూఐ, ఆటోఫిల్ సమస్యలు కూడా తలెత్తాయి. అందుకే.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి.. రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న మూడు డాట్స్ మీద క్లిక్ చేసి.. హెల్ప్(Help) ఆప్షన్లో About Chrome అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి డెస్క్‌టాప్ యూజర్లు గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవచ్చు. మొబైల్ యూజర్లు అయితే.. యాప్‌ను ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో అప్డేట్ చేసుకోవాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
త్వరలో ఆండ్రాయిడ్ 12 ఓఎస్ లాంచ్.. ప్రకటించిన గూగుల్.. ఫీచర్లు ఇవే
జియో బంపర్ ఆఫర్.. రూపాయితో రీచార్జ్ చేసుకుంటే చాలు.. 30 రోజుల వాలిడిటీ
Jobs in Mobile Tech | టెక్ నిపుణులకు కొలువులు ఫుల్.. పుంజుకుంటున్న మొబైల్ టెక్!
Top Trending Words | గూగుల్‌లో 2021లో ఎక్కువగా సెర్చ్ చేసింది దేని గురించో తెలుసా?
మీ పేరు మీద ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉంటే వెంటనే ఇలా చేయాల్సిందే.. లేదంటే అన్నీ బ్లాక్ అవుతాయి