టెలికాం రంగంలో ట్రెండ్ సృష్టించాలంటే అది జియో తర్వాతనే. జియో టెలికాం రంగంలోకి ప్రవేశించి.. భారత టెలికాం వ్యవస్థలోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇంటర్నెంట్ను ప్రతి భారతీయుడికి పరిచయం చేసింది జియోనే. రకరకాల రీచార్జ్ ప్లాన్లు, డేటా ప్లాన్లను ప్రవేశపెట్టాలంటే జియో తర్వాతనే.
ఇప్పటికే జియో తమ టారిఫ్ రేట్లను పెంచుతున్న ప్రకటించి ఓవైపు జియో యూజర్ల మీద భారాన్ని మోపినా.. మరోవైపు అత్యంత చవకైన రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టి మరోసారి వార్తల్లోకెక్కింది జియో. రూపాయి రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది జియో.
సరికొత్త ప్రీపేడ్ రీచార్జ్ ప్లాన్ రూపాయిని ప్రవేశపెట్టిన జియో.. ఈ ప్లాన్ ద్వారా రూపాయితో జియో నెంబర్‌కు రీచార్జ్ చేసుకుంటే.. 30 రోజుల వాలిడిటీని ఉచితంగా అందిస్తారు. అలాగే.. 100 ఎంబీల హైస్పీడ్ డేటాను అందిస్తారు. 100 ఎంబీ డేటా పూర్తయ్యాక.. 30 రోజుల వరకు 64 కేబీపీఎస్ స్పీడ్‌తో డేటాను ఉచితంగా అందిస్తారు.
రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా రీచార్జ్ చేసుకోవాలనుకుంటే.. మైజియో యాప్‌కు వెళ్లి.. రీచార్జ్ సెక్షన్లో వాల్యు అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే.. అధర్ ప్లాన్స్‌లో రూపాయి ప్లాన్ ఆప్షన్ ఉంటుంది. బయ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రూపాయితో రీచార్జ్ చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Jobs in Mobile Tech | టెక్ నిపుణులకు కొలువులు ఫుల్.. పుంజుకుంటున్న మొబైల్ టెక్!
Top Trending Words | గూగుల్‌లో 2021లో ఎక్కువగా సెర్చ్ చేసింది దేని గురించో తెలుసా?
మీ పేరు మీద ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉంటే వెంటనే ఇలా చేయాల్సిందే.. లేదంటే అన్నీ బ్లాక్ అవుతాయి
Most Popular Tweets : 2021లో బాగా పాపులర్ అయిన ట్వీట్స్, హ్యాష్‌టాగ్స్ ఇవే