Top Trending Words | గూగుల్‌లో 2021లో ఎక్కువగా సెర్చ్ చేసింది దేని గురించో తెలుసా?
గూగుల్‌లో 2021లో ఎక్కువగా సెర్చ్ చేసింది దేని గురించో తెలుసా? | ఒకప్పుడు ఏదైనా తెలియని సమాచారం కావాలంటే పుస్తకాల్లో వెతికేవాళ్లం. కానీ.. ఇప్పుడు ఏ సమాచారం అయినా క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షం అవుతుంది
ఒకప్పుడు ఏదైనా తెలియని సమాచారం కావాలంటే పుస్తకాల్లో వెతికేవాళ్లం. కానీ.. ఇప్పుడు ఏ సమాచారం అయినా క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షం అవుతుంది. దానికి కారణం.. గూగుల్ సెర్చ్ ఇంజన్. అందులో దొరకని సమాచారం ఉండదు. దేని గురించయినా.. క్షణాల్లో గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు.

అయితే.. త్వరలో 2021 సంవత్సరం ముగుస్తుండటంతో ఈ సంవత్సరంలో అత్యధికంగా భారత నెటిజన్లు దేని గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారో దానికి సంబంధించిన రిపోర్ట్‌ను గూగుల్ తాజాగా విడుదల చేసింది.
క్రికెట్, కోవిడ్ వాక్సినేషన్, టోక్యో ఒలింపిక్స్ లాంటి టాపిక్స్ ఎక్కువ సెర్చ్ చేసిన వాటిలో ఉన్నట్టు గూగుల్ తెలిపింది.
అలాగే.. బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి(What is Black Fungus), తాలిబాన్ అంటే ఏంటి(What is Taliban).. అలాగే What is the factorial of hundred అనే అకాడమిక్‌కు సంబంధించిన క్వెరీ కూడా అత్యధికంగా సెర్చ్ అయిన కీవర్డ్స్‌లో ఉంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్, వాక్సిన్ పోర్టల్ కోవిన్, టీ20 వరల్డ్ కప్, యూరో కప్, టోక్యో ఒలింపిక్స్ టాప్ ట్రెండింగ్ కీవర్డ్స్‌గా నిలిచాయి.
ఎక్కువగా సెర్చ్ అయిన న్యూస్ ఈవెంట్స్ ఇవే
టోక్యో ఒలింపిక్స్, బ్లాక్ ఫంగస్, ఆఫ్ఘనిస్థాన్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్, Tropical cyclone Tauktae, లాక్ డౌన్ లాంటి అంశాలు టాప్ 10 న్యూస్ ఈవెంట్స్‌లో ఉన్నాయి.
స్పోర్ట్స్‌లో అయితే ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్‌తో పాటు యూరో కప్, కోపా అమెరికా, వింబుల్డన్, పారాలింపిక్స్, ఫ్రెంచ్ ఓపెన్ లాంటి కీవర్డ్స్ టాప్ సెర్చింగ్‌లో ఉన్నాయి.
ఎక్కువ సెర్చ్ అయిన ఫేమస్ పర్సనాలిటీలు వీళ్లే
ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ నీరజ్ చోప్రా.. ఫేమస్ పర్సనాలిటీ సెర్చ్ లిస్ట్‌లో టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఉన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించిన పీవీ సింధు, బజ్రంగ్ పూనియా కూడా టాప్ లిస్టులో ఉన్నారు.
టెస్లా ఫౌండర్ ఎలోన్ మస్క్, విక్కీ కౌశల్, సెహ్నాజ్ గిల్, రాజ్ కుంద్రా లాంటి సెలబ్రిటీలు కూడా ఆ లిస్టులో ఉన్నారు.
నియర్ మీ సెర్చ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ టెస్ట్స్, కోవిడ్ ఆసుపత్రులు, ఆక్సిజన్ సిలిండర్లు, సీటీ స్కాన్స్, టిఫిన్ సర్వీసులు, టేక్ అవుట్ రెస్టారెంట్లు లాంటి కీవర్డ్స్ ఉన్నాయి.
ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాలలో జైభీమ్, షేర్షా, రాధే సినిమాలు టాప్ 3లో ఉన్నాయి. స్క్విడ్ గేమ్, బ్రిడ్జర్టన్, వాండావిజన్, కోబ్రా కాయ్, లోకి లాంటి టీవీ షోలు టాప్ 5లో ఉన్నాయి. పాప్ క్యాట్, ఫిఫా 22, బ్యాటిల్‌ఫీల్డ్ 2042, మాన్స్టర్ హంటర్ రైజ్, రెసిడెంట్ ఎవిల్ విలేజ్ లాంటి గేమ్స్ టాప్ 5లో ఉన్నాయి.
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టాప్ వరల్డ్ సెర్చ్ ట్రెండ్‌లో ఉండగా.. ఇండియా వర్సస్ ఇంగ్లండ్, ఐపీఎల్, ఎన్బీఏ, యూరో 2021 లాంటి కీవర్డ్స్ టాప్ 5లో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మీ పేరు మీద ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉంటే వెంటనే ఇలా చేయాల్సిందే.. లేదంటే అన్నీ బ్లాక్ అవుతాయి
Most Popular Tweets : 2021లో బాగా పాపులర్ అయిన ట్వీట్స్, హ్యాష్‌టాగ్స్ ఇవే
WhatsApp | 20 లక్షల ఇండియన్ వాట్సప్ అకౌంట్లు బ్యాన్.. మీది బ్యాన్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

