న్యూఢిల్లీ : ఇండియన్ బ్రాండ్ ప్లే ఇటీవల ప్లేఫిట్ స్ట్రెంగ్త్ పేరుతో అందుబాటు ధరలో స్మార్ట్‌వాచ్ లాంఛ్ చేసింది. పూర్తిగా చార్జింగ్ చేస్తే ఐదు రోజుల పాటు పనిచేసే ప్లేఫిట్ స్ట్రెంగ్త్ బేసిక్ ఫీచర్లతో రూ 5000లోపు లభిస్తోంది. ఈ స్మార్ట్‌వాచ్ ఇన్ బిల్ట్ స్పీకర్, మైక్‌తో టేక్, డిక్లైన్ కాల్స్ వెసులుబాటును కలిగిఉంది.
స్లీప్ ట్రాకర్ సహా పలు ట్రాకింగ్ మోడ్స్‌తో పాటు ఎస్పీఓ2 మానిటర్, హార్ట్‌రేట్ మానిటర్ వంటి హెల్త్ ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. క్రీడలు, ఇతర యాక్టివిటీల్లో ఉండే యూజర్లు లక్ష్యంగా రగ్గ్డ్ లుక్‌తో ప్లేఫిట్ స్ట్రెంగ్త్ ఆకట్టుకుంటుందని కంపెనీ వెల్లడించింది. దుమ్ము, ధూళి, నీరు నుంచి స్మార్ట్‌వాచ్ పాడవకుండా ఐపీ67 రేటింగ్ కలిగిఉంది.
యూజర్లు తమ స్మార్ట్ఫోన్లను అదేపనిగా చెక్ చేయకుండానే ప్లేఫిట్ స్ట్రెంగ్త్‌తో కాల్స్, మెసేజ్‌లను హ్యాండిల్ చేయవచ్చు. ఇక రూ 5000లోపు మంచి స్మార్ట్‌వాచ్‌ను కోరుకునేవారికి ప్లేఫిట్ స్ట్రెంగ్త్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు.