వాషింగ్టన్ : కరోనా వైరస్‌ను గుర్తించే మైక్రోచిప్‌ను అమెరికాకు చెందిన పెంటగాన్ తయారుచేసింది. ఈ మైక్రోచిప్ టెక్నాలజీ శరీరంలో వైరస్‌ను గుర్తించి ఫిల్టర్ ద్వారా రక్తప్రవాహం నుంచి తొలగించేందుకు సహాయపడుతుంది. ఈ కొత్త టెక్నాలజీని డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (డార్పా) అభివృద్ధి చేసింది.
కొవిడ్ -19 చివరి మహమ్మారి అవుతుందని పరిశోధనా బృందం చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ రిటైర్డ్ కల్నల్ డాక్టర్ మాట్ హెప్బర్న్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి జీవ, రసాయన దాడిని నివారించడానికి మేం ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శరీరంలోని ఏ భాగంలోనైనా చర్మం కింద మైక్రోచిప్ వేయడం ద్వారా శరీరంలో జరుగుతున్న ప్రతి ప్రతిచర్యను తెలియజేస్తుందని, అది పంపే సంకేతాల ద్వారా ఎంతకాలంగా సోకుతున్నదో తెలుస్తుందని డాక్టర్ హెప్బర్న్ తెలిపారు.
కణజాలం లాంటి జెల్ మైక్రోచిప్లోనే ఉంటుందని, ఇది రక్తాన్ని నిరంతరం పరీక్షించి నివేదిక ఇస్తుందని చెప్పేలా తయారు చేసినట్లు డాక్టర్ హెప్బర్న్ పేర్కొన్నాడు. మీరు ఎక్కడ ఉన్నా ఈ టెక్నాలజీ ద్వారా మీ రక్తాన్ని తనిఖీ చేయవచ్చని తెలిపారు. ఫలితం 3 నుంచి 5 నిమిషాల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పరీక్షలు, ఫలితాలు వెంటనే అందుతున్నందున సమయం కోల్పోకుండా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందక ముందే వైరస్ ఉన్న చోట నాశనం చేయడానికి వీలుంటుదని డాక్టర్ హెప్బర్న్ వివరించారు.
ఇందుకోసం, పెంటగాన్ అనుబంధ సంస్థ పాథాలజీ సొసైటీ సహకారంతో రక్తాన్ని పరీక్షించడానికి డయాలసిస్ వంటి యంత్రాన్ని అభివృద్ధి చేసింది. ఇది రక్తప్రవాహం నుంచి వైరస్‌ను పూర్తిగా తొలగించడంలో ఉపయోగపడుతుంది. దీనిని ‘పేషెంట్ -16’ అనే సైనికుడిపై ఉపయోగించారు. ఈ యంత్రం ద్వారా అతడి రక్తం నుంచి వైరస్‌ను పూర్తిగా తొలగించినట్లు పరిశోధకులు చెప్పారు. ఇప్పుడు అతను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఈ యంత్రాన్ని అత్యవసర ఉపయోగం కోసం ఆమోదించింది.
కరోనా సెకండ్ వేవ్ మీ వల్లే వచ్చింది.. ఈసీకి మద్రాస్ హైకోర్టు మందలింపు
30 ఏండ్లుగా గృహ హింస కేసు లేదు.. కశ్మీర్‌లోని ఓ ఊరి కథ
సౌదీ నుంచి భారత్‌కు 80 టన్నుల ఆక్సిజన్
భారీ అణు విషాదానికి 35 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
మూడవ దశ టీకాలకు మార్గదర్శకాలు జారీ
హిమాచల్‌లో ఏప్రిల్ 27 నుంచి 4 జిల్లాల్లో కర్ఫ్యూ
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..